×
Ad

Vivo V70 Elite 5G : కొత్త వివో ఫోన్ కావాలా? వివో V70 ఎలైట్ 5G రేంజే వేరబ్బా.. ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఎందుకు కొనొద్దు? ఫుల్ డిటెయిల్స్

Vivo V70 Elite 5G : ప్రస్తుతం మార్కెట్లో వివో ఫోన్లు చాలా ఉన్నాయి. ఇంతకీ, ఏ మోడల్ వివో ఫోన్ కొంటే బెటర్? వివో V70 ఎలైట్ 5జీ సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published On : February 22, 2026 / 03:55 PM IST

Vivo V70 Elite 5G

  • భారత మార్కెట్లోకి కొత్త వివో V70 ఎలైట్ 5జీ
  • 6.59 అంగుళాల స్క్రీన్, 6500mAh భారీ బ్యాటరీ సెటప్
  • IP68, IP69 రేటింగ్‌,  కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్

Vivo V70 Elite 5G : కొత్త వివో ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వివో లవర్స్ కోసం ఇటీవలే భారత మార్కెట్లో వివో V70 ఎలైట్ 5జీ ఫోన్‌ లాంచ్ అయింది. అయితే, మార్కెట్లో వివో V సిరీస్‌లో ఇదే  అద్భుతమైన ఫోన్ అని చెప్పొచ్చు.

ఈ 5జీ ఫోన్ ఫ్లాట్ డిజైన్, కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు భారీ 6500mAh బ్యాటరీ ప్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సహా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. కానీ, మార్కెట్లో ఎన్నో ఫోన్లు ఉండగా ఈ వివో ఫోన్ ఎందుకు  కొనాలి అంటే అందుకు 4 కారణాలు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ ఎందుకు కొనవద్దు అంటే మూడు కారణాలు ఉన్నాయి.. అవేంటో  తెలుసుకుందాం..

ఎందుకు కొనాలంటే 4 కారణాలివే :
1. భారీ బ్యాటరీ : వివో V70 ఎలైట్ 5G ఫోన్ కాంపాక్ట్ 6.59 అంగుళాల స్క్రీన్ సైజుతో వస్తుంది. అయితే ఇందులో 6500mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ మెయిన్ యూఎస్‌పీ ఏంటంటే.. ఫోన్ బ్యాటరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఛార్జ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎక్కువ సమయం వస్తుంది.

2. టాప్-టైర్ డ్యూరబిలిటీ : ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో వస్తుంది. సబ్‌మెర్షన్‌ మాత్రమే కాదు హై టెంపరేచర్ వాటర్ జెట్‌లను కూడా తట్టుకోగలదు. ఈ ధరలో ఫోన్ దొరకడం చాలా రేర్ అనమాట.

3. మల్టీఫేస్ ZEISS కెమెరాలు : మొదటిసారిగా V సిరీస్ ఫోన్‌లో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో ZEISS ఆప్టిక్స్ ఉన్నాయి. అద్భుతమైన పోర్ట్రెయిట్స్, జూమ్ షాట్‌లను అందిస్తుంది.

4. ప్రీమియం డిస్‌ప్లే, బిల్డ్ : 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందుకుంటుంది. మీరు ఈ వివో ఫోన్‌ మీ చేతిలో పట్టుకుంటే ప్రీమియం లుక్ కనిపిస్తుంది.

Read Also : Croma Apple Sale : ఆపిల్ ఫ్యాన్స్ మీకోసమే.. ఐఫోన్ 16, మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై ఊహించని డిస్కౌంట్లు.. కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

ఎందుకు కొనొద్దు? 3 కారణాలివే :

1. పాత చిప్‌సెట్ : స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. టెక్నికల్ గా చెప్పాలంటే ఐక్యూ 13 లేదా వన్‌ప్లస్ 13s వంటి ఫోన్‌లలో కనిపించే లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ల కన్నా చాలా తక్కువగా ఉంటుంది.

2. వీక్ అల్ట్రావైడ్ కెమెరా : మెయిన్, టెలిఫోటో లెన్స్‌ చాలా గ్రేట్.. కానీ, 8MP అల్ట్రా వైడ్ కెమెరా క్వాలిటీ పరంగా అంత బెటర్ కాదనే చెప్పాలి. 50వేలకు పైగా ఫోన్లలో ఇలాంటి లో క్వాలిటీ కెమెరా ఫోన్ ఎంచుకోవద్దు.

3. సాఫ్ట్‌వేర్ వెర్షన్ : ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఆరిజిన్ OS6పై రన్ అవుతుంది. కస్టమైజ్ ఆప్షన్ ఉన్నప్పటికీ చాలా ప్రీ-ఇన్‌స్టాల్ యాప్‌లు, బ్లోట్‌వేర్‌తో వస్తుంది. అందుకే ఈ ఫోన్ కొనొద్దు అనడానికి అసలు రీజన్..

ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఈ వివో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ చేరుకుంటుంది. ఏ కాంతిలోనైనా ఈ ఫోన్‌ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ లెన్స్‌ అద్భుతమైన కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ ప్లస్ 50MP టెలిఫోటో లెన్స్ ప్లస్ 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 50MP ఐ ఆటో ఫోకస్ కెమెరా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 6500mAh బ్యాటరీ ప్యాక్ అందిస్తుంది. ఇందులో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

ధర ఎంతంటే? :
ధర పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 51,999, 12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 56,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 61,999కు లభిస్తుంది. ఈ ఫోన్ అథెంటిక్ బ్లాక్, సాండ్ బీజ్, ప్యాషన్ రెడ్ వంటి 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.