×
Ad

Vivo V70 Series : వివో ఫ్యాన్స్ గెట్ రెడీ.. కొత్త వివో V70 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర వివరాలు లీక్..

Vivo V70 Series : వివో నుంచి రెండు అద్భుతమైన ఫోన్లు రాబోతున్నాయి. లాంచ్ కు ముందే వివో V70, వివో V70 ఎలైట్ కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.

  • Published On : February 12, 2026 / 02:07 PM IST

Vivo V70 Series

  • వివో V70 ధర రూ.45,999, వివో V70 ఎలైట్ ధర రూ.51,999 నుంచి ఉండొచ్చు
  • 6.59-అంగుళాల 1.5K 120Hz OLED డిస్‌ప్లే, 90W ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీ ఆప్షన్
  • 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4/8s జెన్ 3 చిప్‌సెట్‌

Vivo V70 Series : వివో ఫ్యాన్స్ కోసం కొత్త ఫోన్లు రాబోతున్నాయి. భారత మార్కెట్లో వివో V సిరీస్‌ అతి త్వరలో లాంచ్ కానుంది. కొత్త వివో V70 ఎలైట్, వివో V70 ఫోన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 19న వివో V70 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఫోన్లలో రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్స్, ఫ్లాట్ ఎడ్జెస్ ఆకర్షణీయంగా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు జీస్-బ్యాక్డ్ కెమెరాలు కూడా అందిస్తాయి. స్పెసిఫికేషన్లకు సంబంధించి కీలక వివరాలు రివీల్ అయ్యాయి. వివో V70 ఎలైట్, వివో V70 ఫోన్లు వేరియంట్ వారీగా ధరలు, ప్రీ-బుకింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

భారత్‌లో వివో V70 ఎలైట్, వివో V70 ధర (లీక్) :

టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. స్టాండర్డ్ వివో V70 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB + 256GB ధర రూ. 45,999, 12GB + 256GB ధర రూ. 49,999కు పొందవచ్చు. ప్యాషన్ రెడ్, లెమన్ ఎల్లో కలర్ ఆప్షన్లలో వస్తుంది. వివో V70 ఎలైట్ 3 కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 8GB + 256GB రూ. 51,999, 12GB + 256GB రూ. 56,999, 12GB + 512GB రూ. 61,999కు పొందవచ్చు.

Read Also : Apple iOS 26.3 : ఆపిల్ లవర్స్‌కు పండగే.. iOS 26.3 కొత్త అప్‌డేట్.. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారొచ్చు.. డౌన్‌లోడ్ ఎలాగంటే?

వివో V70 సిరీస్ ప్రీ-బుకింగ్‌లు ఫిబ్రవరి 12న ప్రారంభం కాగా ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతాయి. అధికారిక సేల్ విండో ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో సూపర్‌వీక్ సేల్ మాత్రం ఫిబ్రవరి 25 నుంచి మొదలై మార్చి 3 వరకు కొనసాగుతుంది.

వివో V70, వివో V70 ఎలైట్ స్పెసిఫికేషన్లు :
వివో V70, వివో V70 ఎలైట్ ఫోన్లు రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల 1.5K OLED ప్యానెల్‌ పొందే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా వివో V70 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 పొందుతుంది. వివో V70 ఎలైట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 పొందుతుంది. అదనంగా, ఈ వివో ఫోన్లలో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,500mAh బ్యాటరీ ప్యాక్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌ పొందవచ్చు.

కెమెరా విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్లలో 50MP మెయిన్ సెన్సార్ (సోనీ IMX766 OIS) జీఈఐఎస్ఎస్ ఆధారిత కెమెరా సెటప్‌ ఉంది. 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్‌కు సపోర్టుతో 50MP “నైట్ టెలిఫోటో” కెమెరా (సోనీ IMX882) ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు.