Apple iOS 26.3 : ఆపిల్ లవర్స్‌కు పండగే.. iOS 26.3 కొత్త అప్డేట్.. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారొచ్చు.. డౌన్లోడ్ ఎలాగంటే?
Apple iOS 26.3 : ఆపిల్ ఐఓఎస్ 26.3 అప్డేట్ వచ్చేసింది. యూజర్ల కోసం iOS 26.3, iPadOS 26.3 ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Apple iOS 26
- ఆపిల్ iOS 26.3 అప్డేట్ రిలీజ్
- ఆపిల్ ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ డివైజ్‌కు ఈజీగా స్విచ్ అవ్వొచ్చు
- iOS 26.3 క్యారియర్ లొకేషన్ ట్రాకింగ్‌ను లిమిట్ చేసే సెట్టింగ్ ఆప్షన్
Apple iOS 26.3 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆపిల్ తమ యూజర్ల కోసం iOS 26.3, iPadOS 26.3 రిలీజ్ చేసింది. గత సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన iOS 26, iPadOS 26 వెర్షన్లకు లేటెస్ట్ అప్ గ్రేడ్. iOS 26.2, iPadOS 26.2 రిలీజ్ తర్వాత దాదాపు రెండు నెలలకు ఈ కొత్త అప్డేట్స్ వచ్చాయి.
టెక్ దిగ్గజం ప్రకారం.. iOS 26.3 ప్రధానంగా బగ్ ఫిక్సింగ్, సేఫ్టీ అప్ గ్రేడ్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఈ కొత్త అప్డేట్ ఫీచర్లకు సంబంధించి ఆపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ఈ అప్డేట్లో అనేక కీలక మార్పులు చేసింది.
ఆపిల్ ఐఓఎస్ కొత్త అప్డేట్ ప్రకారం.. ఆపిల్ డివైజ్ నుంచి ఆండ్రాయిడ్ డివైజ్ కు ఈజీగా డేటాను మూవ్ చేయొచ్చు. వినియోగదారులు ఇప్పుడు కొత్త డివైజ్ సెటప్ ప్రక్రియలో తమ డేటాను ట్రాన్స్ ఫర్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది.
ఇందుకోసం ఆపిల్ లేదా గూగుల్ నుంచి సపరేటుగా మరో యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫొటోలు, మెసేజ్, నోట్స్, యాప్‌లు, పాస్వర్డ్లు, ఫోన్ నంబర్లు మరిన్నింటిని మూవ్ చేయొచ్చు. గతంలో ప్లాట్‌ఫారమ్‌ల మధ్య డేటా ట్రాన్స్ ఫర్ ఆప్షన్ ఉన్నప్పటికీ ఈ కొత్త మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది.
కొత్త iOS 26.3 ఫీచర్ ఇదే :
iOS 26.3లో మరో కొత్త ఫీచర్ ఏమిటంటే.. క్యారియర్ లొకేషన్ ట్రాకింగ్ లిమిట్ కోసం సెట్టింగ్ తీసుకొచ్చింది. అయితే, ఈ ఆప్షన్ ప్రస్తుతం కొన్ని క్యారియర్లు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి.
యునైటెడ్ స్టేట్స్లో బూస్ట్ మొబైల్ సపోర్ట్ అందిస్తోంది. యూకేలో ఈఈ, బీటీలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. టెలికామ్ జర్మనీలో ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. థాయిలాండ్‌లో, AIS, ట్రూ కూడా సపోర్ట్ అందిస్తాయి. ఈ ఫీచర్ C1 లేదా C1X మోడెమ్‌లను వాడే డివైజ్‌ల్లో మాత్రమే లభిస్తోంది.
స్మార్ట్‌వాచ్‌లు, హెడ్ఫోన్లు వంటి థర్డ్-పార్టీ వేరబుల్స్ కోసం ఆపిల్ కొత్త యూరప్-ఓన్లీ ఫీచర్లు అందిస్తోంది. ఎయిర్పాడ్ల మాదిరిగానే వన్-ట్యాప్ మెథడ్ ఉపయోగించి యాక్సెసరీలను ఐఫోన్‌తో పెయిర్ చేయొచ్చు. థర్డ్-పార్టీ స్మార్ట్‌వాచ్‌లు కూడా ఐఫోన్ నుంచి రిచ్ నోటిఫికేషన్లను పొందవచ్చు.
ఆపిల్ లాక్ స్క్రీన్ కస్టమైజడ్ మెనూలో కొత్త వెదర్ వాల్‌పేపర్ సెక్షన్ ప్రవేశపెట్టింది. గతంలో, వాతావరణం, ఖగోళ శాస్త్రం ఒకే కేటగిరీలో గ్రూప్ అయ్యాయి. కానీ, ఇప్పుడు వాతావరణం ఆప్షన్ స్పెషల్ కేటగిరీగా సపరేట్ అయింది.
ఆపిల్ iOS 26.3 డౌన్లోడ్, సపోర్టింగ్ ఫోన్లు :
మీ ఐఫోన్లో Settings > General > Software Updates > iOS 26.3ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 11, కొత్త మోడళ్లతో సహా iOS 26కి సపోర్టు ఇచ్చే అన్ని ఐఫోన్లకు ఈ అప్డేట్ అందుబాటులో ఉంది.
