Google Pixel 9a : పిక్సెల్ ఫ్యాన్స్ డోంట్ మిస్.. ఈ గూగుల్ పిక్సెల్ 9aపై బ్రహ్మాండమైన డిస్కౌంట్.. ఎంత తగ్గిందంటే?
Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ 9ఎపై అద్భుతమైన డిస్కౌంట్.. పిక్సెల్ 10ఎ లాంచ్ కు ముందే ఈ పిక్సెల్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అదిరిపోయే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
Google Pixel 9a
- అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9aపై రూ.11వేల కన్నా ఎక్కువ తగ్గింపు
- అతి త్వరలో గూగుల్ పిక్సెల్ 10ఎ లాంచ్
- బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, నో-కాస్ట్ ఈఎంఐ ధర తగ్గింపు
- 120Hz అమోల్డ్ డిస్ప్లే, టెన్సర్ G4 చిప్, 5,100mAh బ్యాటరీ ఆప్షన్
Google Pixel 9a : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో పిక్సెల్ 10a లాంచ్ కానుంది. ఈ ఫోన్ రాకముందే గూగుల్ పిక్సెల్ 9a భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ఈ పిక్సెల్ ఫోన్‌పై ఆకర్షణీయమైన డీల్ అందిస్తోంది. అసలు రూ.49,999 ధర ఉండగా ఈ ఫోన్ ఇప్పుడు రూ.11వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది.
ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అలాగే, అమెజాన్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. ధర తగ్గింపుతో పాటు, పిక్సెల్ 9a పవర్ఫుల్ డిస్ప్లే, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్ మరెన్నో కెమెరా ఫీచర్లను అందిస్తుంది. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9a తగ్గింపు ధరకే ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 9ఎ అమెజాన్ డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ రూ.38,940 కు లిస్ట్ అయింది. ఈ ఫోన్ అసలు ధర రూ.49,999 ఉండగా ఇప్పుడు రూ.11,059 తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో మరెన్నో బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. తద్వారా ధర మరో రూ.1,500 తగ్గి రూ.37,440 సొంతం చేసుకోవచ్చు.
పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఈజీగాట్రేడింగ్ చేసుకోవచ్చు. రూ. 36,700 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ధర ఫోన్ బ్రాండ్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఇ-కామర్స్ దిగ్గజం కేవలం రూ. 1,369 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 422.2 పీపీఐ వద్ద ఫుల్ HD+ (1080 x 2424 పిక్సెల్స్) రిజల్యూషన్ అందిస్తుంది. డిస్ప్లే కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కూడా అందిస్తుంది. బ్రైట్నెస్ పరంగా ఈ పిక్సెల్ ఫోన్ 2700 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9a పవర్ హుడ్ కింద గూగుల్ టెన్సర్ G4 చిప్సెట్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5100mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ సెటప్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా అందిస్తుంది.
