Vivo V70 Elite : వివోనా మజాకా.. 50MP ట్రిపుల్ కెమెరా ఫోన్ ఇప్పుడు రూ. 11వేలు తగ్గింపుతో.. ఎలాగంటే?
Vivo V70 Elite : వివో నుంచి అద్భుతమైన ఫోన్.. వివో V70 ఎలైట్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. 6500mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో కేవలం రూ. 11వేలు తగ్గింపుతో సొంతం చేసుకోండి.
- Sreehari A
- Published on- August 23, 2026 / 10:21 AM IST
Vivo V70 Elite price in India
- వివో V70 ఎలైట్ తక్కువ ధరకే కొనేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్
- వివో 16శాతం తగ్గింపుతో ఈ డీల్ అందిస్తోంది
- బ్యాంకు ఆఫర్లతో ఈ వివో ఫోన్ కొంటే ధర మరింత తగ్గింపు
Vivo V70 Elite : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? మీరు వివో లవర్స్ అయితే ఇది మీకోసమే.. ప్రస్తుతం వివో V70 ఎలైట్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌లో 50MP కెమెరా, భారీ 6500mAh బ్యాటరీ ఉన్నాయి. ప్రస్తుతం, డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను రూ. 11వేల వరకు తక్కువకు సొంతం చేసుకోవచ్చు. వివో V70 ఎలైట్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
ధర తగ్గింపు ఆఫర్ :
వివో V70 ఎలైట్ తక్కువ ధరకే కొనేందుకు బెస్ట్ ఛాన్స్. ఈ ఫోన్ వివో వెబ్‌సైట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,999 కాగా వివో 16శాతం తగ్గింపుతో లభిస్తోంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 66,999కి తగ్గింది. అంతేకాదు.. కంపెనీ కొన్ని అద్భుతమైన ఆఫర్లను కూడా అందిస్తోంది.
వివో V70 ఎలైట్ బ్యాంక్ ఆఫర్, డిస్కౌంట్ :
మీరు వివో V70 ఎలైట్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది. మీరు HDFC, SBI, Axis Bank వంటి ఎంపిక చేసిన బ్యాంకులతో ఈఎంఐపై కొనుగోలు చేస్తే మీకు రూ. 5వేలు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
అంతేకాదు.. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను రూ. 10వేలు తక్కువకే పొందవచ్చు. విద్యార్థులకు అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. కంపెనీ స్టూడెంట్ ఆఫర్ కింద అదనంగా రూ. 1,000 డిస్కౌంట్ అందిస్తోంది. రూ.11వేల వరకు తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఆఫర్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లోని ఆఫర్ల పేజ్ చెక్ చేసుకోండి.
వివో V70 ఎలైట్ స్పెసిఫికేషన్లు :
వివో V70 ఎలైట్ 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 459PPI పిక్సెల్ డెన్సిటీ, 5000 నిట్స్ వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6,500mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది.
కెమెరా పరంగా చూస్తే.. వివో V70 ఎలైట్ బ్యాక్ సైడ్ 50MP ZEISS ప్రైమరీ కెమెరా, 50MP ZEISS సూపర్ టెలిఫోటో కెమెరా, 8MP ZEISS అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ZEISS ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ అందిస్తుంది.
