Vivo Watch 3 Launch : 16 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వివో స్మార్ట్‌వాచ్ 3 ఇదిగో.. ధర, ఫీచర్లు వివరాలివే..!

Vivo Watch 3 Launch : వివో నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ 3 లాంచ్ అయింది. హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ రేంజ్, మన్నికైన డిజైన్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ బ్లూఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.

Vivo Watch 3 with BlueOS, 16-day battery life launched

Vivo Watch 3 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్‌తో పాటు లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ వివో వాచ్ 3ని ఆవిష్కరించింది. ఈ కొత్త వివో వాచ్ 2కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. వివో వాచ్ 3 మోడల్ ముందున్న దాని కన్నా అద్భుతమైన ఆప్షన్లను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను చైనాలో లాంచ్ చేయగా.. వివో ఇండియాలో ఇంకా స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేయలేదు.

వివో వాచ్ 3 సన్నగా ఉండే డిజైన్‌ను కలిగి ఉంది. స్టెయిన్‌లెస్ స్టీల్ క్రౌన్‌తో కుడి వైపున బటన్‌ను కలిగి ఉంటుంది. 1.43-అంగుళాల రౌండ్ స్క్రీన్ 3D ఎఫెక్ట్‌ కర్వ్డ్ గ్లాస్‌ని కలిగి ఉంది. ఈ స్క్రీన్ 466 x 466 పిక్సెల్‌ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఎల్లప్పుడూ-ఆన్ డిస్‌ప్లే లేదా ఏఓడీ మోడ్‌తో ఉంటుంది. 5 మీటర్ల వరకు నీటి నిరోధకతతో మరింత మన్నికైన డివైజ్ అని చెప్పవచ్చు.

Read Also : WhatsApp Voice Chat : వాట్సాప్‌లో గ్రూపు కాల్స్ కోసం వాయిస్ చాట్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

మరెన్నో ఆకర్షణీయమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు :

వివో వాచ్ 3 మోడల్ హెల్త్, ఫిట్‌నెస్ ఔత్సాహికులను ఆకట్టుకునేలా ఉంది. ఎందుకంటే ఇందులో హృదయ స్పందన మానిటర్, (SpO2) సెన్సార్, అసాధారణ హెచ్చుతగ్గులను గుర్తించి వినియోగదారులను హెచ్చరిస్తుంది. ఈ డివైజ్ నిద్ర, ఒత్తిడి స్థాయిలు, మహిళల పీరియడ్స్ వంటి వివిధ అంశాలను ట్రాక్ చేస్తుంది. వినికిడి ప్రొటెక్షన్ కోసం అధిక శబ్ద స్థాయిల నుంచి యూజర్లను హెచ్చరిస్తుంది. 100 కన్నా ఎక్కువ వర్కౌట్ మోడ్‌లు, కస్టమైజడ్ వ్యాయామ ప్లాన్లకు సపోర్టు అందిస్తోంది. అంతేకాదు.. విభిన్న ఫిట్‌నెస్ రొటీన్‌లను కూడా అందిస్తుంది.

Vivo Watch 3 BlueOS, battery life launched

వివో బ్లూఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ :
రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆధారంగా వివో యాజమాన్య (BlueOS) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. వాచ్ 3 ఎన్ఎఫ్‌సీ కార్ కీలు, కెమెరా కంట్రోల్ మరిన్ని వంటి ఫీచర్లను కలిగి ఉంది. వినియోగదారులు కార్డ్‌లను స్టోర్ చేయవచ్చు. పేమెంట్ల కోసం క్యూఆర్ కోడ్ డిస్‌ప్లేతో పాటు స్వైపింగ్‌ను ఉపయోగించవచ్చు. అదనంగా, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కాల్‌ల కోసం (eSIM)కి సపోర్టు ఇస్తుంది. టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‌లతో కనెక్ట్ అవుతుంది. 64ఎంపీ ర్యామ్, 4జీబీ లోకల్ స్టోరేజీతో స్థానిక మ్యూజిక్ స్టోరేజీ సామర్థ్యాలను అందిస్తుంది.

సింగిల్ ఛార్జ్‌పై 16 రోజుల బ్యాటరీ లైఫ్ :

వివో వాచ్ 3505ఎంఎహెచ్ బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌పై 16 రోజుల క్లెయిమ్ బ్యాటరీ లైఫ్‌ని నిర్ధారిస్తుంది. ఈ వాచ్ మూన్‌లైట్ వైట్, స్టార్‌లైట్, బ్రైట్ మూన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ధర వెర్షన్లు, విభిన్న స్ట్రాప్ ఆప్షన్లపై ఆధారపడి ఉంటుంది. లెదర్ స్ట్రాప్‌తో కూడిన ఈసిమ్ వెర్షన్ CNY 1,399 (191 డాలర్లు) నుంచి ప్రారంభమవుతుంది.

Vivo Watch 3 BlueOS, 16-day battery life 

అయితే, సాఫ్ట్ రబ్బర్ స్ట్రాప్ వేరియంట్ ధర సీఎన్‌వై 1,299 (178 డాలర్లు) ఉండవచ్చు. స్ట్రాప్ ఆప్షన్లతో కూడిన బ్లూటూత్ వెర్షన్ ధర సీఎన్‌వై 1,199 (164 డాలర్లు), సీఎన్‌వై 1,099 (150 డాలర్లు) ఉంటుంది. వివో వాచ్ 3 ఫిట్‌నెస్ ట్రాకింగ్, స్మార్ట్ ఫీచర్‌లు, స్టైలిష్ డిజైన్‌లను అందిస్తుంది. వివిధ ధరల వద్ద స్మార్ట్‌వాచ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్లకు అందిస్తుంది.

Read Also : iQoo 12 5G Launch : అమెజాన్‌లో ఐక్యూ 12 5జీ ఫోన్ లిస్టింగ్.. భారత్‌లో డిసెంబర్ 12నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?