Vivo X200 FE : ఖతర్నాక్ ఫీచర్లతో కొత్త వివో X200 FE ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, కెమెరా, ధర వివరాలివే..!

Vivo X200 FE : వివో నుంచి సరికొత్త వివో X200 FE ఫోన్ రాబోతుంది. లాంచ్ డేట్, కెమెరా, డిస్‌ప్లే ఫీచర్ల వివరాలు రివీల్ అయ్యాయి.

Vivo X200 FE : ఖతర్నాక్ ఫీచర్లతో కొత్త వివో X200 FE ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, కెమెరా, ధర వివరాలివే..!

Vivo X200 FE Launch

Updated On : July 8, 2025 / 4:49 PM IST

Vivo X200 FE Launch : వివో లవర్స్‌ కోసం సరికొత్త ఫోన్ రాబోతుంది. అతి త్వరలోనే వివో X200 FE ఫోన్ లాంచ్ కానుంది. డిజైన్, కెమెరా ఫీచర్లతో సహా రాబోయే కాంపాక్ట్ (Vivo X200 FE Launch) స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లు రివీల్ అయ్యాయి.

వివో కంపెనీ ఇప్పటికే కొన్ని కీలక వివరాలను ప్రకటించింది. ఈ వివో ఫోన్ 7.9mm మందం, Zeiss ట్యూన్ కెమెరా, భారీ బ్యాటరీ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. వివో X200 FE లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు ఇలా ఉన్నాయి.

వివో X200 FE లాంచ్ తేదీ :
భారత మార్కెట్లో వివో X200 FE ఫోన్, వివో X ఫోల్డ్ 5తో పాటు జూలై 14న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ రెండు వివో ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్, రిటైల్ ఛానెల్‌లు, థర్డ్ పార్టీ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. అయితే, కచ్చితమైన సేల్ తేదీ ఎప్పుడు అనేది ఇంకా రివీల్ చేయలేదు.

వివో X200 FE డిజైన్ (అంచనా)  :
వివో X200 FE ఫోన్ రౌండెడ్ ఎడ్జ్, మ్యాట్ ఫినిషింగ్‌తో మినిమలిస్ట్ బ్యాక్ ప్యానెల్‌ కలిగి ఉంది. కెమెరా మాడ్యూల్ టాప్ లెఫ్ట్ సైడ్ డ్యూయల్ లార్జ్ సెన్సార్లు, ZEISS బ్రాండింగ్‌, ప్రీమియం డిజైన్‌ కలిగి ఉంది.

Read Also : OnePlus Nord 5 Series : వారెవ్వా.. AI ఫీచర్లతో కొత్త వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 ఫోన్లు లాంచ్.. వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా .. ధర ఎంతో తెలుసా?

వివో X200 FE స్పెసిఫికేషన్లు (అంచనా)  :
వివో X200 FE ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో (Vivo X200 FE) 6.31-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9300+ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6,500mAh బ్యాటరీ ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

IP68, IP69 సర్టిఫికేషన్ కలిగి ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ షూటర్, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ అనే 3 కెమెరాలు ఉంటాయి. 23mm, 35mm, 50mm, 85mm, 100mm వంటి సైజులలో ఉండొచ్చు. ఈ ఫోన్ జెమిని ఇంటిగ్రేషన్, ఆల్ స్క్రీనింగ్, కస్టమైజడ్ యూఐ పార్టులతో మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది.

భారత్‌లో వివో X200 FE ధర (అంచనా) :
వివో X200 FE ఫోన్ ధర 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ధర రూ.54,999, 16GB, 512GB వేరియంట్ ధర రూ.59,999 ఉంటుందని అంచనా.