OnePlus Nord 5 Series : వారెవ్వా.. AI ఫీచర్లతో కొత్త వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 ఫోన్లు లాంచ్.. వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా .. ధర ఎంతో తెలుసా?

OnePlus Nord 5 Series : వన్‌ప్లస్ నుంచి నార్డ్ 5, నార్డ్ CE 5, బడ్స్ 4 లాంచ్ అయ్యాయి. ఏఐ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.. ధర ఎంతంటే?

OnePlus Nord 5 Series : వారెవ్వా.. AI ఫీచర్లతో కొత్త వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 ఫోన్లు లాంచ్.. వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా .. ధర ఎంతో తెలుసా?

OnePlus Nord 5 Series

Updated On : July 8, 2025 / 3:49 PM IST

OnePlus Nord 5 Series : వన్‌ప్లస్ అభిమానుల కోసం ఎట్టకేలకు భారత మార్కెట్లో నార్డ్ 5 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. కొత్త లైనప్‌లో నార్డ్ 5, నార్డ్ CE 5 లాంచ్ చేసింది. ఈ రెండు (OnePlus Nord 5 Series) ఫోన్లతో పాటు వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా రిలీజ్ ప్రవేశపెట్టింది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ రెండు ఫోన్లలో ఇప్పుడు నార్డ్ 4, నార్డ్ CE 4 కన్నా అనేక అప్‌గ్రేడ్‌ ఫీచర్లు ఉన్నాయి.

స్పీడ్ ప్రాసెసర్‌లు, భారీ బ్యాటరీలు, హై-రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లేలు, మెరుగైన కెమెరాలు ఉన్నాయి. ఈ 2 మోడల్స్ మెరుగైన డిజైన్‌ను అందిస్తాయి. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆక్సిజన్ OSలో రన్ అవుతాయి. వన్‌ప్లస్ నార్డ్ 5 పవర్‌ఫుల్ హార్డ్‌వేర్‌ను అందిస్తుంది. అయితే, వన్‌ప్లస్ నార్డ్ CE 5 ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. నార్డ్ సిరీస్ ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ నార్డ్ 5 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ 5లో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉన్నాయి. 10-బిట్ కలర్, 3000Hz టచ్ రెస్పాన్స్‌కు సపోర్టు ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు LPDDR5X ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ వన్‌ప్లస్ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,800mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే, రివర్స్, బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 5లో 50MP సోనీ మెయిన్ సెన్సార్, OIS, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 4K 60fps వీడియోకు సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ 4K 60fps వీడియోకు సపోర్టుతో 50MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ CE 5 ఫోన్ 6.72-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. HDR సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. 256GB వరకు స్టోరేజీని 1TB వరకు పెంచుకునేలా మైక్రో SD కార్డ్‌ సపోర్టు కూడా ఉంది. ఈ ఫోన్ 7,100mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Read Also : Honor X9c 5G : కొత్త హానర్ X9c 5G ఫోన్ వచ్చేసింది.. కింద పడినా నీళ్లలో తడిసినా చెక్కుచెదరదు.. ధర కూడా మీ బడ్జెట్ ధరలోనే..!

వన్‌ప్లస్ నార్డ్ CE 5 ఫోన్ 50MP సోనీ LYT-600 మెయిన్ సెన్సార్, OIS, EISతో వస్తుంది. 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ కలిగి ఉంది. 4K 60fps రికార్డింగ్, స్లో మోషన్, టైమ్-లాప్స్ సహా మల్టీ వీడియో మోడ్‌లకు సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ 1080p రికార్డింగ్, పోర్ట్రెయిట్ మోడ్, స్క్రీన్ ఫ్లాష్‌తో 16MP ఫ్రంట్ సెన్సార్‌తో వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 డ్యూయల్ సిమ్ 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, IR బ్లాస్టర్‌లను సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు ఫోన్‌లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌లు, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, నాయిస్ క్యాన్సిలేషన్‌ సపోర్టు కూడా కలిగి ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ 5 ధర ఎంతంటే? :
వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ మొత్తం 3 కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 8GB + 256GB ధర రూ. 31,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 34,999, 12GB + 512GB ధర రూ. 37,999కు లభిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 5 ధర :
వన్‌ప్లస్ నార్డ్ CE 5 ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.24,999, 8GB + 256GB ధర రూ.26,999. టాప్-ఎండ్ 12GB + 256GB వేరియంట్ ధర రూ.28,999. ఈ వన్‌ప్లస్ సేల్ జూలై 12 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు ఫోన్లు అమెజాన్, వన్‌ప్లస్ ఇ-స్టోర్, రిటైల్ ఛానెల్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.

వన్‌ప్లస్ బడ్స్ 4 ఫీచర్లు, ధర :
వన్‌ప్లస్ బడ్స్ 4 మెటాలిక్ మ్యాట్ ఫినిషింగ్, IP55 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. కోక్సియల్ ట్విన్-డ్రైవర్ సిస్టమ్, డ్యూయల్ DAC, LHDC 5.0 కోడెక్‌కు సపోర్టు అందిస్తుంది. 55dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్, రియల్-టైమ్ అడాప్టివ్ ANC, ఏఐ ఆధారిత కాల్ క్లారిటీ, కేసుతో 45 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్ 3D ఆడియో, గోల్డెన్ సౌండ్ సింకరైజ్, బ్లూటూత్ రేంజ్, గూగుల్ ఫాస్ట్ పెయిర్, డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ, ఏఐ ఆధారిత లైవ్ ట్రాన్సులేషన్ కలిగి ఉంది. వన్‌ప్లస్ బడ్స్ 4 ధర రూ. 5,999కు లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 500 డిస్కౌంట్ పొందవచ్చు.