Vivo X200 FE Launch : వివోనా మజాకా.. కొత్త వివో X200 FE ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ లీక్.. ధర, ఫీచర్లు ఇవేనా?
Vivo X200 FE Launch : వివో X200 FE ఫోన్ భారత్‌కు వచ్చేస్తోంది. లాంచ్ డేట్ ముందుగానే లీక్ అయింది. ధర, ఫీచర్లు వివరాలపై ఓసారి లుక్కేయండి..

Vivo X200 FE India
Vivo X200 FE Launch : వివో అభిమానుల కోసం మరో కొత్త ఫోన్ రాబోతుంది. అతి త్వరలో భారత మార్కెట్లోకి Vivo X200 FE ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కాంపాక్ట్ ఫోన్ వివో S30 ప్రో మినీకి (Vivo X200 FE Launch) రీబ్రాండెడ్ వెర్షన్. రాబోయే వివో మోడల్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ బాడీని కలిగి ఉండొచ్చు. వివో ఫ్లిప్‌కార్ట్, సోషల్ మీడియా ఛానెల్‌లలో ఈ ఫోన్ వివరాలను రివీల్ చేసింది.
ఫస్ట్ లుక్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. నివేదికల ప్రకారం.. ఈ వివో ఫోన్ 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లాంచ్ కావచ్చు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. భారత మార్కెట్లో వివో X200 FE లాంచ్ తేదీని నిర్ధారించారు. నివేదికల ప్రకారం.. ఈ వివో X200 FE ఫోన్ జూలై మూడో వారంలో లాంచ్ కానుంది. లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
భారత్‌లో వివో X200 FE లాంచ్ తేదీ :
నివేదిక ప్రకారం.. భారత మార్కెట్లో వివో X200 FE ఫోన్ జూలై 14న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. కంపెనీ ప్రస్తుతానికి కచ్చితమైన లాంచ్ వివరాలను రివీల్ చేయలేదు. అంబర్ ఎల్లో, లక్సే బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లు ఉండొచ్చు. వివో X ఫోల్డ్ 5తో పాటు వివో X200 FE కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
Read Also : iQOO 12 Price : అమెజాన్ బంపర్ ఆఫర్.. అత్యంత చౌకైన ధరకే ఐక్యూ 12 ఫోన్.. ఇలాంటి డీల్ మళ్లీ జన్మలో రాదు..!
వివో X200 FE స్పెసిఫికేషన్లు :
వివో X200 FE ఫోన్ 120hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో రానుంది. ఈ ఫోన్ 7.99mm మందంతో మీడియాటెక్ డైమన్షిటీ 9300+ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందవచ్చని భావిస్తున్నారు. భారతీయ వేరియంట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది.
ఈ వివో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీతో రావచ్చు. Zeiss-ఆప్టిమైజ్ ట్రిపుల్ కెమెరాతో కెమెరా అప్‌గ్రేడ్‌లు ఉండొచ్చు. 50MP మెయిన్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చు. ఈ వివో ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో రానుంది.
వివో X200 FE ధర ( అంచనా) :
నివేదికల ప్రకారం.. వివో X200 FE ఫోన్ ధర దాదాపు రూ. 55వేలు ఉంటుందని అంచనా. రాబోయే వివో ఫోన్ కచ్చితమైన వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.