భారత్‌లో Vivo X300 సిరీస్ విడుదలకు సిద్ధం.. ధర, లాంచ్ వివరాలు లీక్.. ఇక ఆ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ.. 

Vivo X300ను భారత్‌లో ప్రత్యేకమైన కలర్‌లోనూ విడుదల చేస్తారని టిప్‌స్టర్ సంజు చౌదరి వెల్లడించారు.

భారత్‌లో Vivo X300 సిరీస్ విడుదలకు సిద్ధం.. ధర, లాంచ్ వివరాలు లీక్.. ఇక ఆ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ.. 

Updated On : November 17, 2025 / 1:41 PM IST

Vivo X300 సిరీస్ భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 2న అధికారికంగా రిలీజ్ కానుంది. ఈ సిరీస్ ధర, ఇతర వివరాలు లీకయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, Vivo X300 మోడల్ OnePlus 15 వంటి స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అంతేకాకుండా, ప్రో వెర్షన్‌తో పాటు విడిగా కొనుగోలు చేయగల టెలీకన్వర్టర్ కిట్ ధర కూడా బయటకు వచ్చింది. ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ చైనాలో అక్టోబర్ 13న విడుదలైన విషయం తెలిసిందే.

భారత్‌లో Vivo X300 ధర (లీక్ వివరాలు)
టిప్‌స్టర్ సంజు చౌదరి (@saaaanjjjuuu) ఎక్స్‌లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం..  12GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ సుమారు రూ. 74,999కి, 16GB + 512GB వెర్షన్ రూ. 80,999కి లభించవచ్చు.

Also Read: సౌదీ ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి: సీపీ సజ్జనార్‌

టెలీకన్వర్టర్ కిట్ ధర, ఫీచర్లు
టెలీకన్వర్టర్ కిట్ లేదా టెలిఫొటో ఎక్స్‌టెండర్ కిట్ ధర రూ.20,999గా ఉండొచ్చు. ఈ కిట్‌లో జైస్ 2.35x టెలీకన్వర్టర్ లెన్సులు ఉంటాయి. ఇది ఆప్టికల్ జూమ్‌ను గణనీయంగా పెంచుతుంది. NFC సపోర్ట్ ఉన్న ఈ కిట్, స్మార్ట్‌ఫోన్ కెమెరా యాప్‌లోని టెలీకన్వర్టర్ మోడ్ ద్వారా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

భారత్‌లో లాంచ్ తేదీ, ప్రత్యేక కలర్ ఇదే..
Vivo X300ను భారత్‌లో ప్రత్యేకమైన కలర్‌లోనూ విడుదల చేస్తారని టిప్‌స్టర్ సంజు చౌదరి వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ‘సమ్మిట్ రెడ్’ రంగులో రావచ్చని ఆయన సూచించారు. అయితే దాని రూపురేఖల వివరాలు తెలియరాలేదు. వరల్డ్‌ వెర్షన్‌లో మిస్ట్ బ్లూ, ఫ్యాంటమ్ బ్లాక్ రంగుల్లో విడుదల కాగా, ప్రీమియం X300 Pro మోడల్ డ్యూన్ బ్రౌన్, ఫ్యాంటమ్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి ఇవచ్చింది.

కంపెనీ సమాచారం ప్రకారం, Vivo X300 సిరీస్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో వస్తుంది. దీనికి VS1 Pro ఇమేజింగ్ చిప్, V3+ ఇమేజింగ్ చిప్ ఉంటాయి.