Vivo X300e Full Specifications : వివో లవర్స్ మీకోసమే.. కొత్త వివో X300e ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్!
Vivo X300e Full Specifications : వివో ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఫీచర్లతో కొత్త వివో ఫోన్ రాబోతుంది. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.. పూర్తి ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
Vivo X300e Full Specifications
- ఈ వివో X300e ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్
- రియర్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉండొచ్చు
- 7100mAh బ్యాటరీ ఉంటుందని అంచనా
Vivo X300e Full Specifications : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో కంపెనీ కొత్త వివో X300 సిరీస్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వివో X300e పేరుతో ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్ ఇప్పటికే కీలక డేటాబేస్‌లో కనిపించింది.
కంపెనీ త్వరలోనే గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది. ఇప్పుడు, ఈ ఫోన్‌కు సంబంధించి మరో లీక్ బయటపడింది. ఈ లిస్టింగ్ ఫోన్ అనేక కీలక స్పెసిఫికేషన్లను కూడా వెల్లడించింది. వివో X300e ఫోన్ ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం..
వివో X300e ఫోన్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో X300e ఫోన్ స్పెసిఫికేషన్లు ముందే లీక్ అయ్యాయి. IMEI డేటాబేస్‌లో ఈ ఫోన్ కనిపించింది. వివో X300 ఎఫ్ఈ తర్వాత స్పెసిఫికేషన్లను లీక్ అయ్యాయి. వివో X300e ఫోన్ కాంపాక్ట్ 6.59-అంగుళాల డిస్ప్లేతో రానుంది. ఈ ఫోన్ 1.5K ఓఎల్ఈడీ డిస్ప్లేతో రావచ్చు. ఫ్లాట్ ప్యానెల్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్లో పవర్ఫుల్ చిప్సెట్ అమర్చినట్లు సమాచారం.
వివో X300e ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్తో రన్ అవుతుందని అంచనా. ఇందులో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉండవచ్చు. రియర్ సైడ్ 50MP మెయిన్ కెమెరాతో పాటు, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ కూడా ఉంటుందని అంచనా. థర్డ్ కెమెరా 50MP IMX8 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, జూమ్ ఫొటోల కోసం వాడుతున్నారు. ఈ ఫోన్లో ZEISS-ట్యూన్డ్ కెమెరా సెటప్ ఉండొచ్చు.
ఈ వివో ఫోన్లో 7100mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ సన్నని ఉంటుందని అంచనా. సుమారు 7.99mm మందం, 203 గ్రాముల బరువు ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్లో రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్ ఉండవచ్చు. కంపెనీ మెటల్ ఫ్రేమ్‌ను చేర్చవచ్చు. సేఫ్టీ కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండొచ్చు.
