Vivo Y04 Series : వివో కొత్త Y04s, Y04e ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి భయ్యా..!

Vivo Y04 Series : వివో కొత్త ఫోన్లు అదిరిపోయే ఫీచర్లతో వస్తున్నాయి.. వివో Y04s, వివో Y04e ఫోన్ల పేర్లతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Vivo Y04 Series

Vivo Y04 Series : వివో లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. వివో నుంచి కొత్త Y సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. వివో Y-సిరీస్ లైనప్‌లో వివో Y04s, వివో Y04e స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉండవచ్చు. ఈ రెండు ఫోన్లు ఇప్పుడు గూగుల్ ప్లే సపోర్టు కలిగిన ఫోన్ల జాబితాలో కనిపించాయి. అయితే, ఈ వివో ఫోన్ల అధికారిక పేర్లు, మోడల్ నంబర్లు కూడా లిస్ట్ అయ్యాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.

వివో Y04s, వివో Y04e ఫోన్లు :
లిస్టింగ్ ప్రకారం.. వివో Y04s మోడల్ నంబర్ V2531 కలిగి ఉండగా, వివో Y04e మోడల్ నంబర్ V2532తో లిస్టు అయింది. డేటాబేస్‌లో ఎలాంటి స్పెసిఫికేషన్లు లేదా హార్డ్‌వేర్ వివరాలు రివీల్ చేయలేదు. గూగుల్ ప్లేలో ఈ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ త్వరలో ఉండొచ్చునని సూచిస్తున్నాయి.

మోడల్ నంబర్ V2511తో పాటు మరో వివో స్మార్ట్‌ఫోన్ EEC (యురేషియన్ ఎకనామిక్ కమిషన్) సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో కూడా కనిపించింది. వివో బ్రాండ్ రిజిస్ట్రేషన్‌ కలిగి ఉంది. కానీ, గూగుల్ ప్లే మాదిరిగా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను రివీల్ చేయలేదు.

Read Also : 6 ​Best Camera Phones : ఫోన్లు భలే ఉన్నాయి.. ఈ 6 కెమెరా ఫోన్లు పిక్సెల్ 9a కన్నా తోపు.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Vivo Y19s ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డిస్‌ప్లే : వివో Y19s ప్రో 264ppi పిక్సెల్ డెన్సిటీ, 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.68-అంగుళాల HD+ రిజల్యూషన్ స్క్రీన్‌ను కలిగి ఉంది.
ప్రాసెసర్ : ఈ ఫోన్ యూనిసోక్ టైగర్ T612 SoC కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్ : ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS15తో ప్రీ ఇన్‌స్టాల్ అయింది.
కెమెరా : ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో 50MP మెయిన్ కెమెరా కలిగి ఉంది. 0.08MP డెప్త్ సెన్సార్, అపర్చర్ f/1.8, అపర్చర్ f/3.0. ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
బ్యాటరీ : ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 44W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.