Vivo Y400 Pro : వివో లవర్స్ గెట్ రెడీ.. పవర్‌ఫుల్ ఏఐ ఫీచర్లతో వివో Y400 ప్రో వచ్చేస్తోందోచ్.. మీ బడ్జెట్ ధరలోనే..!

Vivo Y400 Pro : ఏఐ ఫీచర్లు, 32MP ఫ్రంట్ కెమెరాతో వివో కొత్త ఫోన్ రాబోతుంది. అది కూడా మీ బడ్జెట్ ధరలోనే.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Vivo Y400 Pro

Vivo Y400 Pro : వివో లవర్స్ కోసం మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో వివో Y400 ప్రో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ (Vivo Y400 Pro) ఉండొచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్ కలిగి ఉంది.

డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు.

Read Also : 4k Video Smartphones : కంటెంట్ క్రియేటర్ల కోసం టాప్ 4k వీడియో స్మార్ట్‌ఫోన్లు ఇవే.. కెమెరా ఫీచర్లు కిర్రాక్.. ఎంత ఖరీదైనా కొనాల్సిందే..!

వివో Y400 ప్రో స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
నివేదికల ప్రకారం.. డిస్‌ప్లే, బ్రైట్‌నెస్ 4,500 నిట్స్, వివో Y400 ప్రో డిజైన్ వంటి ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ ట్విన్ కెమెరా యూనిట్ ఉంది. కెమెరాలు పిల్-షేప్ కెమెరా యూనిట్‌లో వర్టికల్‌‍గా ఉంటాయి. కెమెరా కింద రింగ్ లైట్ యూనిట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు కూడా ఉన్నాయి.

వివో ఫోన్ 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో వస్తుంది. వివో Y400 ప్రో ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 5,500mAh బ్యాటరీ 90W ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ 15కి సపోర్టు చేస్తుంది.

సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీతో రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. వివో Y400 ప్రోలో ఏఐ నోట్ అసిస్ట్, ఏఐ సూపర్ లింక్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 25వేల వరకు ఉండవచ్చు. వైట్, గోల్డ్, పర్పల్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.4 మి.మీ మందం ఉంటుంది.

Read Also : Motorola Edge 60 Stylus : పండగ చేస్కోండి.. ఇలా కొన్నారంటే ఈ మోటోరోలా స్టైలస్ ఫోన్ జస్ట్ రూ. 10,899కే.. లిమిటెడ్ ఆఫర్..!

మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా వివో T4 అల్ట్రా ఫోన్ లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లు, కలర్ ఆప్షన్లు రివీల్ అయ్యాయి. గత ఏప్రిల్‌లో వివో T4 5G, వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ మోడళ్లు లాంచ్ అయ్యాయి.