Vodafone Idea New Plans : వోడాఫోన్ ఐడియా నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఇందులో ఏ ప్లాన్ బెటర్ అంటే?
Vodafone Idea New Plans : దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా (Vi) ఏడాది వ్యాలిడిటీతో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ధర రూ. 2999, రూ. 2899లుగా ఉన్నాయి. అదనంగా, టెల్కో కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను కూడా తగ్గించింది.
Vodafone Idea New Plans : దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా (Vi) ఏడాది వ్యాలిడిటీతో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ధర రూ. 2999, రూ. 2899లుగా ఉన్నాయి. అదనంగా, టెల్కోకొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను కూడా తగ్గించింది. వోడాఫోన్ ఇప్పటికే ఏడాది పొడవునా కొన్ని ప్లాన్లను అందిస్తోంది.
ఇప్పుడు మరో రెండు ప్లాన్లు లిస్టును అందిస్తోంది. రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు 365 రోజుల వ్యాలిడిటీ వ్యవధి, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, వంటి డేటా మరెన్నో ఉన్నాయి. ఈ కొత్త వోడాఫోన్ ప్లాన్లపై ఏయే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో వివరంగా చూద్దాం.
కొత్త వోడాఫోన్ ప్లాన్లు (Vodafone Idea) రూ. 2999 ప్లాన్ మొత్తం 850GB 4G డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 100 SMSలను ఏడాది పాటు వ్యాలిడిటీతో అందిస్తుంది. అదనంగా.. ఈ ప్లాన్ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి పరిమితులు లేకుండా అన్లిమిటెడ్ నైట్ డేటా (Night Data)ను అందిస్తుంది. రోజువారీ డేటా క్యాప్ గురించి యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
రూ. 2899 విలువైన రెండవ కొత్త (Vodafone Idea) ప్లాన్ 1.5GB రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 365 రోజుల వరకు అలాగే ఉంటుంది. ఈ ప్లాన్ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి పరిమితులు లేకుండా అన్లిమిటెడ్ నైట్ డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ వారాంతపు డేటా, అదనపు ఖర్చు లేకుండా ప్రతి నెలా 2GB వరకు బ్యాకప్ డేటాతో పొందవచ్చు.
మరిన్ని ప్లాన్ వివరాలివే :
ఈ ప్లాన్లతో పాటు, వోడాఫోన్ (Vodafone) రూ. 3099 విలువైన మరో వార్షిక ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రతి డేటాకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ , Vi Hero బెనిఫిట్స్, 1 ఏడాది Disney+ Hotstar మొబైల్ సబ్స్క్రిప్షన్, మరిన్నింటిని 365 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది.
టెలికాం ఆపరేటర్ ఇటీవలే ఖతార్‌లో జరుగుతున్న FIFA ప్రపంచ కప్ 2022 కోసం నాలుగు కొత్త అంతర్జాతీయ రోమింగ్ (IR) ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్లలో రూ. 2999, రూ. 3999, రూ. 4499, రూ. 5999 ఉన్నాయి. ఈ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లన్నీ ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా దేశాలకు వర్తిస్తాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..