వాహనాల రద్దీ అధికంగా ఉండే నగరాల్లో రోడ్లపై వెళ్లడమంటే ఎంతో చిరాకు వస్తుంది. ఎంతటి ధనవంతుడైనా ఈ ట్రాఫిక్ జామ్‌ల నుంచి తప్పించుకోలేడు. దీంతో ఇటువంటి చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ఎగిరే కారును అభివృద్ధి చేయాలని ఇంజనీర్లు చాలా కాలంగా ప్రయత్నాలు జరుపుతున్నారు.
ఇప్పుడు ఈ కలను అమెరికాకు చెందిన ఓ సంస్థ నిజం చేస్తోంది. ఆ దేశంలోని అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ఈ కారును అభివృద్ధి చేస్తోంది. ఈ కారు రోడ్డుపై వెళ్లగలదు, అలాగే, మనకు అవసరం వచ్చినప్పుడు పైకి ఎగిరి వెళ్లగలదు. ఈ మోడల్ జీరో కారును ఆ సంస్థ ఇంజనీర్లు ఇటీవల కాలిఫోర్నియాలో రోడ్డుపై పరీక్షించి చూశారు.
ఈ పరీక్ష విజయవంతమైందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. మొదట ఈ కారు రోడ్డుపై ప్రయాణించి, అనంతరం పైకి ఎగిరింది. ఆ తర్వాత మళ్లీ రోడ్డుపైకి వచ్చింది. ఈ జీరో కారులో నాలుగు చిన్న ఇంజన్లను వీల్స్ వద్ద అమర్చారు. దీంతో ఎలక్ట్రిక్ కారులా ఇది రోడ్డుపై కూడా ప్రయాణిస్తుంది.
ఈ జీరో కారులో ఖాళీగా ఉండే బానెట్, డిక్కీలో 8 ప్రొపెల్లర్లు ఉంటాయి. అవి వేర్వేరు వేగాలతో తిరుగుతాయి. దీంతో కారును ఏ దిశలోనయినా తిప్పుకోవచ్చు. ఈ కారులో ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడారు. దీంతో ఈ కారు బరువు 385 కిలోలుగా ఉంది. ఈ కారు గాలిలో దాదాపు 177 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
అయితే, రోడ్డుపై మాత్రం 56 కిలోమీటర్లు దూరం మాత్రమే వెళ్తుంది. ప్రపంచంలో ఇప్పటికే ఫ్లయింగ్ కార్లు ఉన్నాయి. ఈ జీరో కారు మాత్రం వాటికంటే భిన్నమైనది. ఇప్పటికే ఉన్న ఫ్లయింగ్ కార్లు టేకాఫ్ సమయంలో రోడ్డును రన్ వేలాగా వాడుకుంటాయి. ఈ జీరో కారు మాత్రం రోడ్డుపై నిట్టనిలువుగా దిగగలుగుతుంది. ఈ కారును సాధారణ జనాలు సులువుగా వాడవచ్చు. ఈ కారు ధర దాదాపు రూ. 2.57 కోట్లుగా ఉంటుంది.
⚡️The first ever electric car flight was made by the American company Alef Aeronautics👀
The video shows the Model A electric car driving along the road and then flying over another vehicle. The car is reportedly capable of driving 354 km and flying 177 km on a single charge.… pic.twitter.com/MrzHzzkwjK— 🌚 MatTrang 🌝 (@MatTrang911) February 21, 2025