చంద్రునిపై ఎండపడే చోటా నీళ్లున్నాయి. NASAకు ఈ ప్రాంతమే ఎందుకు ముఖ్యమంటే?

  • Publish Date - October 27, 2020 / 04:32 PM IST

Water on Moon: చంద్రునిపై నీరు ఉందా? ఉంటే.. చంద్రని ఉపరితలమంతా నీరు ఆవరించి ఉందా? ఇలాంటి ఎన్నో సందేహాలకు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విశ్లేషణత్మాక వివరణ ఇచ్చింది.

నాసా చంద్రునిపై నీళ్ల ఉనికిని గుర్తించేందుకు Stratospheric Observatory for Infrared Astronomy (SOFIA) టెలిస్కోపు ద్వారా పరిశోధించింది.

ఇందులో చంద్రునిపై సూర్యరశ్మి తగిలే ఉపరితలంపై వైపు నీళ్లు ఉన్నాయని తొలిసారి నాసా ధ్రువీకరించింది.



అంతేకాదు.. ఈ నీళ్లు చంద్రునిపై ఉపరితలమంతా ఆవరించే అవకాశం ఉందని భావిస్తోంది. చల్లదనం పరిమితం కాదని, చీకటి ప్రాంతాల్లో కూడా నీరు ఆవరించే ఉంటుందని నాసా పేర్కొంది. SOFIA టెలిస్కోపు గుర్తించిన ఆధారాలకు సంబంధించి వివరణను జనరల్ నేచరుల్ ఆస్ట్రానమీలో ప్రచురించింది. SOFIA అనే 2.5 మీటర్ల టెలికస్కోపు ప్రాజెక్టును నాసా, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించాయి.



ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 747-SP 45వేల అడుగుల ఎత్తుకు వెళ్లగల సామర్థ్యం ఉంది.

ఈ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా టెలిస్కోపుతో చంద్రుని ఉపరితలాన్ని నాసా పరిశోధించింది.

ఈ సోఫియా టెలిస్కోప్ Faint Object infraRed Camera (FORCAST) ద్వారా చంద్రుని ఉపరితలంపై నీటి అణువుల స్థాయిని గుర్తించేందుకు సాయపడుతుంది.

భూమి నుంచి దక్షిణ అర్థగోళంలోని చంద్రునిపై నీటి అణువుల స్థాయిని గుర్తించగలదు. దీన్ని Clavius అని పిలుస్తారు.

సహారాలో నీళ్లే 100 రెట్లు ఎక్కువ: 
గతంలో చంద్రుని ఉపరితలంపై నీటి జాడలను గుర్తించగా అందులో హైడ్రోజన్ సమ్మేళనాలు ఉన్నాయని తేలింది. నీటి నాణ్యత చాలా చిన్నదిగా ఉంది.

చంద్రునిపై మట్టిలో ఉన్న నీటి అణువుల స్థాయి కంటే సహారా ఎడారిలోని నీళ్లు 100 రెట్లుకు పైగా ఎక్కువని నాసా వెల్లడించింది.



చంద్రునిపై సూర్యరశ్మి కారణంగా దాని ఉపరితలంపై హైడ్రోజన్ .. ఆక్సీజన్ కణిజాలాలతో సమ్మేళనం చెంది చంద్రునిపై మట్టిలో hydroxyl గా మారిపోతుంది. ఈ హైడ్రాక్సిల్ నీటిలోకి (ద్రవరూపం)లోకి మారిపోతుండచ్చునని నాసా పరిశోధకులు భావిస్తున్నారు.



చంద్రుని ఉపరితలంపై నీళ్లు ఉద్భవించడానికి అనేక కారణాలు ఉండి ఉండొచ్చునని అంటున్నారు నాసా పరిశోధకులు.. చంద్రునిపై వాతావరణం మందకొడిగా ఉండదు. సూర్యరశ్మి పడే చంద్రుని ఉపరితలంపై నీరు ఉందని SOFIA గుర్తించడంపై పరిశోధకులు ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

గతంలో చంద్రునిపై నీటిని ఎక్కడ గుర్తించారు? :
చంద్రునిపై నీటి ఉనికిని సోఫియా గుర్తించడానికి ముందు దాని ఉపరితలంపై కొంతమొత్తంలో హైడ్రేషన్ ఉండి ఉంటుందని పరిశోధకులు భావించారు. ఈ హైడ్రేషన్ కు సంబంధించి ఏదైనా భాగంలో నీటి అణువులు ఉన్నాయా? లేదా అనేది స్పష్టత లేదు.

మొట్టమొదటి అపోలో మిషన్ లో భాగంగా 1969లో వ్యోమగాములు చంద్రునిపై నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అక్కడి ఉపరితలంమంతా పొడిగా ఉందని తేల్చేశారు.



కానీ, గత 20 ఏళ్లలో చంద్రునిపై సాగిన అనేక మిషన్లలో చీకటి ఉపరితలంపై నీరు ఘనీభవన స్థితిలో ఉందని ధ్రువీకరించాయి. చంద్రుని అక్షం చుట్టూ ఉండే నీడ వంటి బిలాల్లో నీరు ఉండి ఉంటుందనే భావిస్తున్నారు.

ఇప్పుడు చంద్రునిపై సూర్యకాంతి పడే ఉపరితలాల్లో నీరు ఉందని గుర్తించడంతో సైంటిస్టుల్లో ప్రత్యేకించి మరింత ఆసక్తిని రేకిత్తిస్తోంది.

మరోవైపు.. చంద్రునిపై నీరు ఆధారంగా దీర్ఘకాలిక అధ్యయనాలకు మరింత ఉపకరిస్తుందని నాసా భావిస్తోంది. అందుకే Artemis lunar exploration ప్రొగ్రామ్ లో భాగంగా నాసా 2024 నాటికి చంద్రునిపైకి మరో పురుషుడు లేదా మొట్టమొదటి మహిళా వ్యోమగామిని పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.