What are ghost calls
Ghost Call : ఇదేందిరా మామా.. మిస్‌డ్ కాల్ విన్నాం.. ఇన్‌కమింగ్ కాల్ విన్నాం.. ఆఖరికి అన్‌నౌన్ కాల్ గురించి కూడా విన్నాం.. ఇప్పుడేంటి? ఘోస్ట్ కాల్ అంటున్నారు.. అని అనుకుంటున్నారా? అవును.. ఈ ఘోస్ట్ కాల్ అంటే ఏమి లేదు.. మీకు తెలియని నంబర్ (Unknown Numbers) నుంచి వచ్చే కాల్స్‌నే ఘోస్ట్ కాల్ అంటారు అనమాట.. మీకు కూడా ఇలా ఘోస్ట్ కాల్ వచ్చిందా? అంటే.. మీకు గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి రింగ్ అవుతుంది.
కానీ, మీరు ఆ కాల్ ఆన్సర్ చేస్తే.. అవతలి వైపు ఎవరూ ఉండరు? ఎవరూ మాట్లాడరు కూడా. టెలిమార్కెటర్లు, స్కామర్లు కొన్నిసార్లు నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసేందుకు ఇలా ఘోస్ట్ కాల్ చేస్తుంటారు. ఇలా కాల్ వచ్చి అలా కట్ అయిపోతుంది. అయితే, ఈ ఫీచర్‌ను మీ ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా కూడా ఉపయోగించవచ్చు.
ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో అనేక యాప్‌లు ఘోస్ట్ కాలింగ్‌ను ఒక సర్వీసుగా అందిస్తున్నాయి. అందులో ట్రూకాలర్ కూడా ఒకటి. ఇది ఇటీవల ఐఫోన్‌ల కోసం ఒక ప్రైమరీ అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఇది iOS, Android డివైజ్‌ల్లో సపోర్టు అందిస్తుంది. అయితే, ట్రూకాలర్ ఘోస్ట్ కాలింగ్ ఫీచర్ ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ యాక్సెస్ చేసేందుకు పేమెంట్ ప్లాన్ తప్పక తీసుకోవాలి.
ఘోస్ట్ కాల్ ఇలా ఉపయోగించండి :
మీరు ఒక పాత పరిచయస్తుడిని కలిశారని ఊహించుకోండి. మీ సంభాషణ మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఒక ఘోస్ట్ కాల్ అలాంటి వారిని మీకు దూరంగా ఉండేందుకు సాకుగా పనిచేస్తుంది. అదేవిధంగా, మీరు ఎప్పుడైనా అసౌకర్య పరిస్థితిని నివారించడానికి ఒక ముఖ్యమైన కాల్‌లో ఉన్నట్లు నటించాల్సి వస్తే.. ఈ ఘోస్ట్ కాల్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ట్రూకాలర్‌లో మీరు మీ స్వంత నంబర్‌కు మాత్రమే ఘోస్ట్ కాల్‌లు చేయగలరని గమనించాలి. అయితే, మీరు ఘోస్ట్ కాలర్ పేరు, ఫోన్ నంబర్‌ను పర్సనలైజడ్ చేసుకోవచ్చు. దానిని మరింత వాస్తవికంగా కనిపించేలా కాలర్ ఐడీ ఫొటోను కూడా యాడ్ చేయొచ్చు. ట్రూకాలర్ వినియోగదారులను ఘోస్ట్ కాల్‌లను షెడ్యూల్ చేయొచ్చు. తద్వారా మరింత అథెంటికేట్‌గా కనిపిస్తాయి.
Read Also : Credit Cards : ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడితే లాభామా? నష్టమా? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి!
ట్రూకాలర్‌లో ఘోస్ట్ గేలింగ్‌ను ఎలా ఉపయోగించాలి? :
ప్రస్తుతం, మీరు ఒకేసారి ఒక ఘోస్ట్ కాల్‌ని మాత్రమే షెడ్యూల్ చేయగలరు. మీకు త్వరగా ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక ఘోస్ట్ కాల్ మిమ్మల్ని కాపాడుతుంది అనమాట..