Netflix Account New Rules : భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కొత్త రూల్స్ ఇవే.. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాస్‌‌వర్డ్ షేరింగ్ విధానం ఎలా పనిచేస్తుందంటే?

Netflix Account New Rules : భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై కఠినమైన నిబంధనలను అమలు చేసింది. ఒక ఇంటికి మాత్రమే అకౌంట్ యాక్సెస్‌ను పరిమితం చేసింది. కొత్త విధానం ప్రకారం.. వినియోగదారులు యాక్సెస్ కోడ్‌లను ఎంటర్ చేసి ప్రైమరీ ఫ్యామిలీ Wi-Fiకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.

What are new rules for Netflix Account Sharing in India

Netflix Account Sharing New Rules : ప్రముఖ ఓటీటీ స్ర్టీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ సింగిల్ అకౌంట్ యూజర్ తమ అకౌంట్‌ను అందరితో షేరింగ్ చేసుకునే వీలుండేది. కానీ, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఇతర దేశాలతో పాటు భారత్‌‌లోనూ పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని నిలిపివేసింది.

ఇకపై నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఒకే ఇంటిలో నివసించని స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేస్తే.. నెట్‌ఫ్లిక్స్ ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. స్ట్రీమింగ్ దిగ్గజం ఇటీవల భారత ఓటీటీ మార్కెట్లోనూ అకౌంట్, పాస్‌వర్డ్ షేరింగ్‌పై కఠినమైన పరిమితులను ప్రకటించింది. ఈ చర్యతో పాస్‌వర్డ్ షేరింగ్‌ అనేది ఒక ఇంటికి మాత్రమే పరిమితం అయింది. స్నేహితులతో అకౌంట్లను షేర్ చేసుకునే అలవాటు ఉన్న కొంతమంది వినియోగదారులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేరింగ్ కొత్త రూల్స్ ఏంటి? :
నెట్‌ఫ్లిక్స్ కొత్త పాలసీ ఒకే అకౌంట్‌ను ఒక కుటుంబంలో మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేస్తుంది. కుటుంబ సభ్యులు కలిసి జీవిస్తున్నప్పటికీ.. వారు ఇంట్లో ఉన్నా, సెలవులో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా వివిధ డివైజ్‌లలో Netflix అకౌంట్ ఆస్వాదించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంలో అకౌంట్ షేరింగ్ చేయడాన్ని సులభతరం చేయడానికి ‘Transfer Profile’, ’Manage Access and Devices’ వంటి ఫీచర్లను అందిస్తుంది.

Read Also : Netflix Household Account : నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్ అకౌంట్ ఏంటి? ఇదేలా సెటప్ చేసుకోవాలి.. పాస్‌వర్డ్ షేరింగ్ ఇక వారికి మాత్రమే..!

గతంలో, భారత్‌లో చాలా మంది యూజర్లు తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లను ఖర్చును తగ్గించుకోవడానికి స్నేహితులతో షేర్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తూ.. ఈ కొత్త చర్యలతో ప్రైమరీ కుటుంబానికి చెందని వ్యక్తులతో ఇలాంటి అకౌంట్ షేరింగ్ చేయడం కుదరదు. కానీ, ఇంటి వెలుపల ఉన్న సభ్యులు ఎవరైనా వారి ప్రొఫైల్‌లను కొత్త అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి, ప్రత్యేక సభ్యత్వాన్ని పొందడం ద్వారా వినియోగించుకోవచ్చు. అంటే.. ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ చేయడానికి తప్పకుండా పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను ఎలా గుర్తిస్తుంది :
నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను గుర్తించడానికి అడ్వాన్సడ్ మెథడ్స్ ఉపయోగిస్తుంది. అకౌంట్లో లాగిన్ చేసిన డివైజ్‌ల నుంచి యూజర్ నేమ్, IP అడ్రస్, డివైజ్ ID, అకౌంట్ యాక్టివిటీ ట్రాక్ చేస్తుంది. అలా చేయడం ద్వారా ప్రైమరీ హౌస్ వెలుపల ఉన్న వినియోగదారులకు యాక్సెస్‌ని పొందడం సవాలుగా మారుతుంది. నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు ప్రాథమిక కుటుంబానికి వెలుపల నుంచి అకౌంట్ యాక్సెస్ చేసేందుకు కోడ్‌లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్‌లు 7 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటాయి. అదనంగా, వినియోగదారులు కనీసం ప్రతి 31 రోజులకు ఒకసారి ప్రైమరీ ఫ్యామిలీ Wi-Fiకి కనెక్ట్ చేయాలి.

Netflix Account New Rules : What are new rules for Netflix Account Sharing in India

ట్రావెల్ చేసేవారిపై ఎలాంటి ప్రభావం ఉండదు :
మీరు ట్రావెల్ చేసే సమయంలో అదే Netflix అకౌంట్ ఉపయోగించలేమా అనే ఆందోళన అక్కర్లేదు. ఈ కొత్త చర్యలతో ప్రయాణంలో ఉన్నప్పుడు యాప్‌ను ఉపయోగించే వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. నిర్దిష్ట ధృవీకరణ ప్రక్రియ ఇంకా వివరంగా లేనప్పటికీ.. యూజర్ నేమ్ ఐడెంటిటీని వెరిఫై చేసేందుకు డివైజ్ IDని చెక్ చేయాల్సి ఉంటుంది.

భారత్‌లో పేమెంట్ షేరింగ్ ఇంకా అందుబాటులో లేదు :
నెట్‌ఫ్లిక్స్ గతంలో అమెరికా వంటి మార్కెట్‌లలో పేమెంట్ అకౌంట్ షేరింగ్‌ను అనుమతించింది. అయితే, భారత మార్కెట్లో దేశంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించింది. ఈ క్రమంలోనే కంపెనీ ఈ ఆఫ్షన్ అందించకూడదని నిర్ణయించుకుంది. భారత్‌లో అత్యంత ఖరీదైన స్ట్రీమింగ్ సర్వీసుగా నెట్‌ఫ్లిక్స్ 4K కంటెంట్‌ను అందించే, గరిష్టంగా 4 డివైజ్‌లకు సపోర్టు ఇచ్చే ప్రీమియం ప్లాన్‌కు నెలకు రూ. 649 చెల్లించాల్సి ఉంటుంది.

పాస్‌వర్డ్ షేరింగ్‌ కఠినమైన విధానంతో నెట్‌ఫ్లిక్స్ కంపెనీకి ప్రయోజనకరంగా మారింది. 2023 రెండవ త్రైమాసికంలో, నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా 5.9 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్‌లను పొందింది. Q1 2022లో సబ్‌స్క్రైబర్ క్షీణతను ఎదుర్కొంది. దశాబ్దంలో మొదటి తగ్గుదలగా చెప్పవచ్చు. ఆ తర్వాత మళ్లీ కొత్త సబ్‌స్క్రైబర్‌లతో నెట్‌ఫ్లిక్స్ పుంజుకుంది.

Read Also : Google Job Resume Tips : మీ రెజ్యూమ్‌‌లో ఈ 2 పెద్ద తప్పులు చేస్తే.. మీకు గూగుల్‌ ఉద్యోగం ఇవ్వదు.. ఇలా ప్రీపేర్ చేస్తే జాబ్ పక్కా..!