Google Job Resume Tips : మీ రెజ్యూమ్‌‌లో ఈ 2 పెద్ద తప్పులు చేస్తే.. మీకు గూగుల్‌ ఉద్యోగం ఇవ్వదు.. ఇలా ప్రీపేర్ చేస్తే జాబ్ పక్కా..!

Google Job Resume Tips : గూగుల్ కంపెనీలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? మీ రెజ్యూమ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఉద్యోగం రావడం కష్టమే. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్, నోలన్ చర్చ్ ఉద్యోగ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలకు సంబంధించి కీలకమైన విషయాలను షేర్ చేశారు.  

Google Job Resume Tips : మీ రెజ్యూమ్‌‌లో ఈ 2 పెద్ద తప్పులు చేస్తే.. మీకు గూగుల్‌ ఉద్యోగం ఇవ్వదు.. ఇలా ప్రీపేర్ చేస్తే జాబ్ పక్కా..!

Google will not hire you if you include these 2 things in your resume, former Google HR reveals

Google Job Resume Tips : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) ఏడాదికి 2 మిలియన్లకు పైగా జాబ్ అప్లికేషన్‌లను అందుకుంటుంది. నియామక ప్రక్రియలో మరింత పిక్యర్‌గా మారుతున్న తరుణంలో గూగుల్‌లో ఉద్యోగావకాశాలను పొందడం చాలా కష్టమే. ముఖ్యంగా ఉద్యోగానికి అప్లయ్ చేయడానికి ముందు మీ రెజ్యూమ్‌ను ప్రత్యేకంగా ఉండాలి. రిక్రూటర్లను ఆకర్షించేలా ఉంటేనే జాబ్ సంపాదించగలరు.

గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేయాలని చాలామందికి ఉంటుంది. అది ఒక కలగా భావిస్తుంటారు. కానీ, గూగుల్ కంపెనీలో ఉద్యోగం పొందడం అంత సులభం కాదని ప్రతిఒక్కరూ గుర్తించాలి. కంపెనీ రిక్రూటింగ్ విభాగంలో పనిచేసిన మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ (Former Google HR) సెర్చ్ దిగ్గజం కంపెనీలో ఎలా ఉద్యోగం పొందాలి? అనే కొన్ని కీలకమైన విషయాలను రివీల్ చేశారు.

Read Also : Google Employees : రాబోయే రోజుల్లో గూగుల్ ఉద్యోగులకు ఇంటర్నెట్ పనిచేయదు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

ఈ రెండు తప్పులే.. మీ ఉద్యోగాన్ని అడ్డుకునేది..
గూగుల్ జాబ్‌లు పొందడం చాలా కష్టమన్నారు. ఎందుకంటే. ప్రతి ఏడాది 2 మిలియన్ల కన్నా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. హార్వర్డ్‌లో చేరడం కన్నా కూడా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. మీరు రిక్రూటర్‌లను ఆకట్టుకోవాలన్నా.. మీ డ్రీమ్ జాబ్‌ ఛాన్స్ పొందాలన్నా.. మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేయడంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. 2012 నుంచి 2015 వరకు గూగుల్ రిక్రూటర్‌గా పనిచేసిన నోలన్ చర్చ్.. మీ రెజ్యూమ్‌లో నివారించాల్సిన రెండు పెద్ద తప్పులు చేయొద్దని సూచించారు.

ఈ 2 తప్పులే కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాలను అడ్డుకుంటున్నాయని చెప్పారు. అందులో మొదటిది.. ‘చాలా పదాలతో లాంగ్ పేరాగ్రాఫ్‌లు రాయడం..’ ఇలా ఎందుకు రాస్తారో అంతగా అర్థం కావడం లేదు. మీ రెజ్యూమ్ ఇలా కనిపిస్తే.. నియామక ప్రక్రియలో మీరు ముందుకు వెళ్లే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

Google will not hire you if you include these 2 things in your resume, former Google HR reveals

Google Job Resume Tips : Google will not hire you if you include these 2 things in your resume, former Google HR reveals

రెండవ ముఖ్యమైన విషయం రెజ్యూమ్‌లోని విషయాలు స్పష్టంగా ఉండాలి. అంటే.. మీ అనుభవాలు, స్కిల్స్ వంటివి క్లుప్తంగా వ్యక్తీకరించాలి. మీ రెజ్యూమ్‌లో అలా చేయలేకపోతే.. ఆఫీసులో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమస్యలను నివారించాలంటే ChatGPT లేదా Grammarly వంటి AI టూల్స్ ఉపయోగించమని సూచిస్తుంది. ఈ టూల్స్ మీ రెజ్యూమ్‌ను క్లీన్ చేయగలవు.

తద్వారా రెజ్యూమ్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతర టెక్ దిగ్గజాల మాదిరిగా గూగుల్ కూడా ఖర్చును తగ్గించుకోవాలని భావిస్తోంది. అందుకే, గూగుల్ ఇటీవల 12వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించింది. ఇదే సమయంలో గూగుల్ కొత్త నియామక ప్రక్రియలో మరింత మందిని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ మంది కొత్త రిక్రూట్‌లను తీసుకోవచ్చు. మీ రెజ్యూమ్‌ను ప్రత్యేకంగా ఉంచడంతో పాటు సాధారణ తప్పులను నివారించడం చాలా అవసరమని గమనించాలి.

మీ రెజ్యూమ్‌ ఇలా ఉంటేనే.. 
గూగుల్‌లో 20 ఏళ్లు పనిచేసిన మరో మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ లాస్లో బాక్ (Laszlo Bock) కూడా ఇదే విషయంలో అనేక విషయాలను వెల్లడించారు. కంపెనీలో పనిచేసే సమయంలో తాను 20వేల రెజ్యూమ్‌లను చూసినట్టు తెలిపారు. ఆయా రెజ్యూమ్‌లో కొన్ని సాధారణ లోపాలను కూడా ఆయన ప్రస్తావించారు. చాలా రెజ్యూమ్‌లలో అక్షరదోషాలు, పేలవమైన ఫార్మాటింగ్ లేదా చాలా పొడవుగా పేరాగ్రాఫ్‌లు ఉన్నాయని చెప్పారు. రెజ్యూమ్ ప్రిపరేషన్ విషయంలో బాక్ ఒక అద్భుతమైన టిప్ చెప్పారు.

ప్రతి 10 ఏళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు ఒక పేజీ రెజ్యూమ్ మాత్రమే ఉండాలన్నారు. మీరు ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించిన తర్వాత మీ రెజ్యూమ్ పెద్ద మ్యాటరే కాదన్నారు. అందుకే మీ రెజ్యూమ్ చాలా సింపుల్‌గా స్పష్టంగా ఉంచుకోవాలి. అనవసరమైన వివరాలను మీ రెజ్యూమ్‌లో అసలు రాయొద్దు. మీరు గూగుల్ లేదా ఏదైనా పోటీ సంస్థలో ఉద్యోగం కోసం లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే.. ఈ రెజ్యూమ్ టిప్స్ తప్పక పాటించాలి. ఎందుకంటే.. మీ రెజ్యూమ్.. మీకు ఉద్యోగం వస్తుందో లేదో చెప్పేస్తుంది.

Read Also : Netflix Household Account : నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్ అకౌంట్ ఏంటి? ఇదేలా సెటప్ చేసుకోవాలి.. పాస్‌వర్డ్ షేరింగ్ ఇక వారికి మాత్రమే..!