ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్ : వాట్సప్‌లో కొత్త ఫీచర్లు
వాట్సప్ బీటా వర్షన్ 2.19.18 కొత్త బీటా అప్ డేట్ ను విడుదల చేసింది. ఈ బీటా వెర్షన్ కొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ లో చాట్ షార్ట్ కట్ ఫీచర్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.

వాట్సప్ బీటా వర్షన్ 2.19.18 కొత్త బీటా అప్ డేట్ ను విడుదల చేసింది. ఈ బీటా వెర్షన్ కొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ లో చాట్ షార్ట్ కట్ ఫీచర్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.
ఫేస్ బుక్ ఆధారిత ప్రముఖ మెసేజింగ్ ఆన్ లైన్ సంస్థ వాట్సప్ లో మరికొన్ని కొత్త ఫీచర్లు వచ్చేశాయి. ఎప్పటి కప్పుడూ యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సప్ తన ప్లాట్ ఫాంపై సరికొత్త ఫీచర్లతో అలరిస్తోంది. అందిన నివేదిక ప్రకారం.. వాట్సప్ బీటా వర్షన్ 2.19.18 కొత్త బీటా అప్ డేట్ ను విడుదల చేసింది. ఈ బీటా వెర్షన్ కొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ లో చాట్ షార్ట్ కట్ ఫీచర్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. త్వరలో యాండ్రాయిడ్ యూజర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ బీటా వర్షన్ ఫీచర్ సాయంతో నేరుగా చాట్ బాక్స్ లోనే వాట్సప్ ఫొటోలు, వీడియోలను వీక్షించవచ్చు. వాట్సప్ లో ఈ బీటా ఫీచర్ మాత్రమే కాదు.. మరిన్ని ఫీచర్లు బీటా యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. స్టిక్కర్లు సెర్చ్ ఆప్షన్ కూడా బీటా వర్షన్ లో ఉంది.
డబ్ల్యూఏబీ బీటాఇన్ఫో ప్రకారం.. ఇదో ‘బగ్’ గా పేర్కొంటూ ట్వీట్ చేసింది. ‘‘వాట్సప్ తొలిసారి ఓపెన్ చేసినప్పుడు.. చివరిసారి ఓపెన్ చేసిన ట్యాబ్ దగ్గర ‘స్టిక్కర్స్’ బటన్ కనిపిస్తుంది. కానీ, ఒకవేళ బటన్ పై క్లిక్ చేస్తే.. వెంటనే అది మాయం అవుతుంది’’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్రిక్కును వాట్సప్ 2.19.18, 2.19.6 బిజినెస్ రెండు బీటా వెర్షన్లపై మాత్రమే అందిస్తోంది. వాట్సాప్ బీటా వెర్షన్ అందిస్తోన్న ‘షో ఇన్ చాట్’ అనే ఆప్షన్.. షేర్ చేసిన ఫొటోలను ఇతరులకు చాట్ బాక్సులోకి షేర్ చేయొచ్చు. ఈ ఫొటోను ముందుగా ఎక్కడి నుంచి షేర్ చేశారో తెలుసుకోనే వీలుంది. షో ఇన్ చాట్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే.. మరో చాట్ లో ఫొటో ఎగ్జాట్ లోకేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మరో రెండు ఆప్షన్లు కూడా ఉన్నాయి. అవే.. ‘సెట్ యాజ్’, రోటేట్ ఆప్షన్స్. మొదటి మెనూలో ట్యాబ్ పై ఈ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. రోటేట్ లెఫ్ట్, రోటేట్ రైట్ అనే ఆప్షన్ కొత్తగా అందిస్తోంది.