WhatsApp Channels : వాట్సాప్ ఛానల్ అడ్మిన్ల కోసం కొత్త బీటా అప్‌డేట్.. ఈజీగా స్టిక్కర్లను షేర్ చేసుకోవచ్చు..!

WhatsApp Channels : వాట్సాప్ ఛానల్ అడ్మిన్లు ఇకపై తమ ఫాలోవర్లతో స్టిక్కర్లను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఛానల్ నెలవారీ యాక్టివ్ యూజర్లు 50 మిలియన్లు దాటేశారు.

WhatsApp Channels : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఈ ఏడాది ప్రారంభంలో సెప్టెంబర్‌లో భారత్‌తో సహా 150 దేశాల్లో వాట్సాప్ ఛానల్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఛానల్‌లు, ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ మాదిరిగా వన్-వే బ్రాడ్‌కాస్ట్ టూల్స్, కొంతమంది యూజర్లు పెద్ద సంఖ్యలో వాట్సాప్ యూజర్లతో అప్‌డేట్‌లను షేర్ చేయగలరు.

ఛానల్ అడ్మిన్లు మాత్రమే ఛానల్‌లలో మెసేజ్‌లు పంపగలరు. ఇతర యూజర్లు ఆ మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వొచ్చు. మీరు ఏదైనా సెలబ్రిటీ, బిజినెస్ లేదా కంటెంట్ క్రియేటర్ల ద్వారా క్రియేట్ చేసిన ఛానల్‌ని కనుగొనడానికి డైరెక్టరీ నుంచి సెర్చ్ చేయొచ్చు. వాట్సాప్ ఛానల్స్ ద్వారా స్టిక్కర్‌లను కూడా యాక్సెస్ చేయొచ్చు.

ఛానల్ అడ్మిన్ల కోసం కొత్త బీటా అప్‌డేట్ :

నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఛానల్ అడ్మిన్లు తమ ఫాలోవర్లతో స్టిక్కర్‌లను షేర్ చేసేందుకు అనుమతించే కొత్త బీటా అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరిమితంగా కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. దీనికి సంబంధించి స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. రాబోయే రోజుల్లో ఇతర యూజర్లందరికి అందుబాటులోకి వస్తుంది. అప్‌డేట్ కేవలం స్టాటిక్ స్టిక్కర్‌లను మాత్రమే కాకుండా యానిమేటెడ్, డైనమిక్ స్టిక్కర్‌లను పంపడాన్ని కూడా అనుమతిస్తుంది.

Read Also : Jio Mobile Plans : ఈ జియో ప్లాన్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీగా వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూడొచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఛానల్‌లలో స్టిక్కర్‌లను షేర్ చేయడానికి మీకు ఇంకా యాక్సెస్ ఉందో లేదో చెక్ చేయడానికి మీ వాట్సాప్ బీటా వెర్షన్ అత్యంత ఇటీవలి వెర్షన్‌కి అప్‌డేట్ చేసినట్టు నిర్ధారించుకోండి. మీ సొంత ఛానల్ ట్యాబ్‌కి వెళ్లి, కీబోర్డ్‌ను పైకి లాగండి. ఎమోజి కీబోర్డ్‌తో పాటు స్టిక్కర్‌ల ఆప్షన్ కనిపిస్తే.. మీరు ఫీచర్‌కి యాక్సెస్ కలిగి ఉంటారు. తదుపరి కొన్ని వారాల్లో ఈ ఫీచర్ చివరికి మరిన్ని బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వస్తుందని నివేదిక తెలిపింది. అయితే, వాట్సాప్ ఛానల్‌ల యూజర్లందరికి అందుబాటులో ఉంటుందని మరో నివేదిక తెలిపింది.

WhatsApp Channels Sticker 

ఏడు వారాల్లోనే 500 మిలియన్ యూజర్లు :

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఛానల్‌ల మెసేజ్ ప్రకారం.. వాట్సాప్ ఛానల్‌లు మొదటి ఏడు వారాల్లో నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 500 మిలియన్లను దాటాయి. వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌లతో పాటు ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో కనిపించే విధంగా వాట్సాప్ ఛానల్‌లు అప్‌డేట్ ట్యాబ్‌లో ఉంటాయి.

వాట్సాప్ ఛానల్‌లలోని మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రొటెక్షన్ లేదు. ఛానల్ అడ్మిన్లు మాత్రమే అప్‌డేట్‌లు, మెసేజ్‌లను పోస్ట్ చేసుకోవచ్చు. అయితే ఛానల్ మెంబర్లు లేదా ఫాలోవర్లు ఆ మెసేజ్‌లకు రెస్పాండ్ అయ్యేందుకు వీలుంది. అన్ని మెసేజ్‌లు ఛానల్‌లో మొదటిసారి షేర్ చేసిన సమయం నుంచి 30 రోజులు మాత్రమే కనిపిస్తాయి.

Read Also : 2023 Honda CB350 Launch : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా 2023 హోండా CB350 బైక్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు