2023 Honda CB350 Launch : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా 2023 హోండా CB350 బైక్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

2023 Honda CB350 Launch : ప్రముఖ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీగా 2023 హోండా CB350 కొత్త బైక్ భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు.

2023 Honda CB350 Launch : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా 2023 హోండా CB350 బైక్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

2023 Honda CB350 launched in India

2023 Honda CB350 Launch : ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) 2023 హోండా CB350ని రూ. 1,99,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసింది. ప్రధాన పోటీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీగా 2023 హోండా సీబీ350 బైక్ భారత మార్కెట్లోకి వచ్చింది.

ఈ మిడ్-సైజ్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ కొత్త బైక్ డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ బైక్‌లను బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. 2023 హోండా సీఈ350 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డీఎల్ఎక్స్, డీఎల్ఎక్స్ ప్రో (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ధరలు ఈ కింది ఉన్నాయి.

* 2023 సీఈ350 డీఎల్ఎక్స్ – రూ. 1,99,900
* 2023 సీబీ350 డీఎల్ఎక్స్ ప్రో – రూ. 2,17,800

హోండా సీబీ350 ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్ (రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ వింకర్లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్), మెటల్ ఫెండర్‌లు, ఫ్రంట్ ఫోర్క్‌లు, స్ప్లిట్ సీట్లు మెటాలిక్ కవర్లతో వస్తుంది. హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ సిస్టమ్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్‌తో డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2023 Honda CB350 launched in India

2023 Honda CB350 launch

5 కలర్ ఆప్షన్లలో కొత్త సీబీ350 బైక్ :
రెట్రో క్లాసిక్ మోడల్ మొత్తం రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ క్రస్ట్ మెటాలిక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్, మాట్ డ్యూన్ బ్రౌన్ వంటి 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. 2023 హోండా సీబీ350లో 348.36సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, పీజీఎమ్-ఎఫ్ఐ ఇంజిన్ కూడా ఉంది. 21.1పీఎస్ గరిష్ట శక్తిని 29.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. అలాగే, ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడా వస్తుంది.

2023 హోండా సీబీ350 టెక్నికల్ ఫీచర్లపై మాట్లాడుతూ.. మోటార్‌సైకిల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ప్రెషరైజ్డ్ నైట్రోజన్-ఛార్జ్డ్ రియర్ సస్పెన్షన్‌తో వస్తుంది. బ్రేకింగ్ ముందు 310ఎమ్ఎమ్ డిస్క్, బ్యాక్ 240ఎమ్ఎమ్ డిస్క్ అందిస్తుంది. అయితే, డ్యూయల్-ఛానల్ ఎబీఎస్ ప్రామాణికమైనది. హెచ్ఎంఎస్ఐ 2023 హోండా సీబీ350పై ప్రత్యేకంగా 10-ఏళ్ల వారంటీ ప్యాకేజీని (3-ఏళ్ల ప్రమాణం + 7-ఏళ్ల ఆప్షన్) అందిస్తోంది.

Read Also : Jio Mobile Plans : ఈ జియో ప్లాన్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీగా వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూడొచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!