WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అప్‌డేట్ రాబోతోంది. అదే.. డిలీట్ ఫర్ ఎవరీవన్ (Delete For Everyone) ఫీచర్.. ఇదివరకే ఈ ఫీచర్ ఉంది కదా అంటారా? దానికి ఇది అప్‌డేట్..

WhatsApp Delete for Everyone : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అప్‌డేట్ రాబోతోంది. అదే.. డిలీట్ ఫర్ ఎవరీవన్ (Delete For Everyone) ఫీచర్.. ఇదివరకే ఈ ఫీచర్ ఉంది కదా అంటారా? దానికి ఇది అప్‌డేట్.. మన వాట్సాప్ చాట్‌లో ఏదైనా ఫొటో లేదా వీడియోను పోస్టు చేస్తే.. దాన్ని డిలీట్ చేయాలంటే కేవలం పంపినవారి చాట్ బాక్సులో మాత్రమే డిలీట్ అవుతుంది. అది కూడా టైం లిమిట్.. గంటలోగా ఆ మెసేజ్ డిలీట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మెసేజ్‌ను డిలీట్ చేయాల‌నుకుంటే డిలీట్ ఫ‌ర్ ఎవ‌రీవ‌న్ (Delete For Everyone) ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే Delete for Me అనే ఆప్షన్ కూడా ఉంది. ఇది కేవలం అంటే కేవ‌లం పంపించిన వ్య‌క్తి చాట్ బాక్స్‌లో మాత్ర‌మే ఆ ఆప్ష‌న్ డిలీట్ అవుతుంది.

డిలీట్ ఫ‌ర్ ఎవ‌రీవ‌న్ అంటే.. ఆ మెసేజ్ పంపించిన వాళ్లంద‌రి చాట్ బాక్స్‌లో డిలీట్ అవుతుంది. ఈ డిలీట్ ఫీచర్ (Delete Feature) 2017లో అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. మొదట్లో ఈ ఫీచర్ కు టైం లిమిట్ 7 నిమిషాలు ఉండేది. కొన్ని నెలలు గడిచిన తర్వాత టైం లిమిట్ గంటకు సెట్ చేసింది వాట్సాప్. ఏదైనా మెసేజ్, వీడియో, ఫైల్ అవతలి వ్యక్తి చాట్ బాక్సులోకి పంపిన గంటలోపు డిలీట్ చేసుకోవచ్చు. టైం లిమిట్ దాటిన తర్వాత ఆ మెసేజ్ ఇతరుల చాట్ బాక్సులో డిలీట్ చేయడం కుదరదు.

అయితే ఇప్పుడా ఆ టైం లిమిట్ ఎత్తివేసేందుకు వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ iOS‌లో కొత్త వీడియో ఇంటర్ ఫేస్‌లో కనిపించింది. అందరికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. టైంతో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు మీ మెసేజ్‌లను డిలీట్ చేసుకోవచ్చు. మెసేజ్ లను డిలీట్ ఫర్ ఎవరీవన్ ఆప్షన్ ద్వారా ఒకేసారి రెండు (పంపిన/పొందిన) చాట్ బాక్సుల్లో డిలీట్ చేసే వీలుంటుంది. ముందుగా ఈ ఫీచ‌ర్‌ను వాట్స‌ప్ బీటా యూజ‌ర్లకు అందుబాటులోకి రానుంది. టెస్టింగ్ పూర్తి అయిన తర్వాత రెగ్యులర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
Read Also : WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

ట్రెండింగ్ వార్తలు