WhatsApp is getting another Instagram-like feature soon, will show Status within the chat
WhatsApp New Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను డెవలప్ చేస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ముందుగా బీటాలో iOS యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను టెస్టింగ్ చేస్తోంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు తీసుకురానుంది. రాబోయే వాట్సాప్ ఫీచర్ కూడా తీసుకురానుంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ iOS యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. యూజర్లకు WhatsApp చాట్ లిస్టు నుంచి నేరుగా స్టేటస్ చూడవచ్చు.
ఎందుకంటే ఈ ఫీచర్ కారణంగా చాట్‌ను కొద్దిగా గందరగోళంగా కనిపించేలా చేస్తుంది. WABetaInfo నివేదిక ప్రకారం.. WhatsApp iOS బీటా వెర్షన్ 22.18.0.70తో చాట్ లిస్టులో స్టేటస్ అప్‌డేట్ అందించనుంది. ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా కాలంగా ఇదే ఫీచర్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా, చాట్ లిస్ట్‌లోని స్టేటస్ ఫీచర్ విజిబిలిటీ వాట్సాప్‌కు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లాగా యూజర్ల స్టేటస్ ఇమేజ్‌లు, వీడియోలను వీక్షిస్తున్నప్పుడు యాడ్స్ కనిపించే ఛాన్స్ కూడా యాప్‌కు అనుమతిస్తుంది.
WhatsApp is getting another Instagram-like feature soon, will show Status within the chat
WhatsApp త్వరలో తన ప్లాట్‌ఫారమ్‌లో యాడ్స్ డిస్లపే చేస్తుందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. చాట్ లిస్ట్‌లో స్టేటస్ పోస్ట్‌లను వెంటనే చూడాలనుకుంటున్నారా లేదా అనే ఆప్షన్ వాట్సాప్ యూజర్లకు అందిస్తుందని నివేదిక నివేదిక సూచిస్తుంది. అదనంగా, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఎలా పని చేస్తాయో అదేవిధంగా 24 గంటల తర్వాత అదృశ్యమయ్యేలా వీడియోలు, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల WhatsApp కోసం మూడు కొత్త ప్రైవసీ ఫీచర్‌లను ప్రకటించింది. అడ్వాన్సడ్ ప్రొటెక్షన్ ప్రైవసీ యూజర్లకు చాట్‌లపై మరింత కంట్రోల్ అందించనుంది.
వాట్సాప్ ప్రస్తుతం పనిచేస్తున్న ఫీచర్లలో స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ఫీచర్ ఒకటి. యాప్‌లో ఒకసారి వ్యూ లేదా ఫొటోలు లేదా వీడియోలపై స్క్రీన్‌షాట్‌లను తీసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. iOS యూజర్ల కోసం WhatsApp బీటాలో డెవలప్ స్టేజీలో ఉంది. Android బీటా వెర్షన్‌లో అప్‌డేట్‌లను అందించనుంది. అదనంగా, ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ యూజర్లు ‘ఆన్‌లైన్’ స్టేటస్‌ని త్వరలో హైడ్ కూడా అనుమతిస్తుంది. ఈ ప్రైవసీ ఫీచర్‌లు రాబోయే నెలల్లో అందరికీ అందుబాటులో రానుందని కంపెనీ ధృవీకరించింది.
Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. డిలీటెడ్ మెసేజ్‌ల రికవరీ ఆప్షన్ వస్తోంది..!