WhatsApp New Feature : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. డిలీటెడ్ మెసేజ్‌ల రికవరీ ఆప్షన్ వస్తోంది..!

WhatsApp New Feature : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అతి త్వరలో వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది.

WhatsApp New Feature : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. డిలీటెడ్ మెసేజ్‌ల రికవరీ ఆప్షన్ వస్తోంది..!

WhatsApp New Feature : WhatsApp will soon give users the option to recover deleted messages

WhatsApp New Feature : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అతి త్వరలో వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త మెసేజింగ్ ఫీచర్‌ ద్వారా యూజర్లు డిలీట్ చేసిన మెసేజ్‌లను రికవరీ చేయవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్ కనిపించింది. మీరు ఎవరికైనా పంపిన మెసేజ్ అనుకోకుండా డిలీట్ చేసినట్టుయితే.. మీరు మెసేజ్ వెంటనే రికవరీ చేసుకోవచ్చు.

ప్రస్తుత సెటప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను రికవరీ చేసేందుకు అనుమతి లేదు. Wabetainfo ప్రకారం.. WhatsApp యూజర్లు తమ మెసేజ్ పంపిన తర్వాత అనుకోకుండా డిలీట్ చేయగానే మీకు Undo బటన్‌ కనిపిస్తుంది. మీరు ఇంతకు ముందు డిలీట్ చేసిన మెసేజ్‌లను రికవరీ చేయడానికి మీకు కొన్ని సెకన్ల సమయం పడుతుంది. మీరు For Me Delete ఆప్షన్ నొక్కిన వెంటనే Undo బటన్ కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే మీ ఫొటోలను సరిచేసేందుకు దీనిపై Tap చేయవచ్చు.

WhatsApp New Feature : WhatsApp will soon give users the option to recover deleted messages

WhatsApp New Feature : WhatsApp will soon give users the option to recover deleted messages

ప్రస్తుతానికి, ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మీరు Play Store నుంచి Latest Update బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. మీ వాట్సాప్ వెర్షన్‌ను అప్‌డేట్ చేయండి. మీరు లేటెస్ట్ బీటాను ఇన్‌స్టాల్ చేసినప్పటికీ “For Me Delete”ని ఉపయోగించినప్పుడు స్నాక్‌బార్ అందుబాటులో లేదు. మీ WhatsApp అకౌంట్లో ఇప్పటికీ ఫీచర్‌ అందుబాటులోకి రాలేదు. రాబోయే రోజుల్లో WhatsApp మరింత మంది బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. WhatsApp యూజర్లు ఫోన్ నంబర్‌లను తెలియని యూజర్ల నుంచి హైడ్ చేసేందుకు అనుమతించే మరొక ఫీచర్‌పై పని చేస్తోంది. మెసేజింగ్ యాప్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Wabetainfo ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.

వాట్సాప్ బీటా వెర్షన్ 2.22.17.23ని రిలీజ్ చేసింది. బీటా టెస్టర్‌లు మాత్రమే ఫీచర్‌కు యాక్సెస్ చేసుకోవచ్చు. వాట్సాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో మాత్రమే ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. iOS బీటా టెస్టర్లు భవిష్యత్తులో ఫీచర్‌ని పొందవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ కమ్యూనిటీలకు కూడా పరిమితం కానుంది. మెసేజింగ్ యాప్ గతంలో కమ్యూనిటీ మెంబర్ల నుంచి ఫోన్ నంబర్‌లను కూడా హైడ్ చేసింది. యూజర్ కమ్యూనిటీకి సంబంధించిన ఫోన్ నంబర్ అడ్మిన్‌లు, నిర్దిష్ట సబ్ గ్రూపులోని ఉన్న యూజర్ల నుంచి హైడ్ అవుతుందని WhatsApp CEO విల్ క్యాత్‌కార్ట్ తెలియజేశారు.

Read Also : Windows WhatsApp Users : విండోస్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త వెర్షన్.. డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?