WhatsApp makes it easier to search Groups in the chat list_ Here’s how
WhatsApp Search Groups : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. రీసెంట్ గ్రూప్స్ (Recent groups) అని పిలిచే కాంటాక్టు పేరును ఉపయోగించి WhatsApp గ్రూపులను సెర్చ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
WaBetaInfo నివేదిక ప్రకారం.. వెర్షన్ 2.2245.9 ద్వారా WhatsApp డెస్క్‌టాప్ యూజర్లు తమ సెర్చ్ లిస్ట్‌లో కాంటాక్ట్ పేరును సెర్చ్ చేసిన ప్రతిసారీ ‘Recent Groups’ చూడవచ్చు. వాట్సాప్ యూజర్లు తరచూ తమను తాము మల్టీ గ్రూపుల్లో జాయిన్ కావొచ్చు. దీనివల్ల ఏదైనా కాంటాక్టుతో సాధారణమైన గ్రూప్ పేరును గుర్తుంచుకోవడం వారికి కష్టమవుతుంది.
కానీ, కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు నిర్దిష్ట కాంటాక్టు పేరును ఉపయోగించి గ్రూపులను కనుగొనవచ్చు. వినియోగదారు సెర్చ్ బార్‌లో నిర్దిష్ట కాంటాక్ట్ పేరును సెర్చ్ చేసిన ప్రతిసారీ, వారు కాంటాక్ట్‌తో ఉన్న అన్ని Recent WhatsApp గ్రూపుల జాబితాను పొందవచ్చు. నిర్దిష్ట కాంటాక్ట్‌తో అన్ని గ్రూపులకు ఉమ్మడిగా లిస్టు చేసే ఫీచర్ ఇప్పటికే చాట్ డేటాలో అందుబాటులో ఉందని యూజర్లు గమనించాలి. వాట్సాప్ చాట్ లిస్ట్‌లోనే ఈ ఫీచర్ ఉపయోగించవచ్చునని నివేదిక పేర్కొంది.
WhatsApp makes it easier to search Groups in the chat list_ Here’s how
వాట్సాప్‌లో (Recent Groups) గ్రూప్ ఫీచర్ డెస్క్‌టాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. Windows Beta యూజర్లు (Message Yourself) ఫీచర్‌ని పొందవచ్చు. Microsoft Store నుంచి Windows 2.2248.2.0 అప్‌డేట్ కోసం సరికొత్త WhatsApp బీటాను ఇన్‌స్టాల్ చేసిన డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
‘Mesage Yourself’ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమకు తాముగా టెక్స్ట్‌లు, మీడియా, నోట్‌లను పంపుకోవచ్చు. ప్రస్తుతం, వాట్సాప్ యూజర్లు తమకు తాముగా మెసేజ్‌లను పంపుకోవడానికి wa.me/+91 తర్వాత వారి 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఉపయోగించడం వంటి ట్రిక్‌లపై ఆధారపడాల్సి ఉంటుంది.
వాట్సాప్ ప్రకారం, Message Yourself ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు తాముగా మెసేజ్‌లతో పాటు ఫోటోలు, ఆడియోలు, వీడియోలు పంపుకోవచ్చు. WhatsApp యూజర్లు ఈ కొత్త ఫీచర్‌ని ఉపయోగించి వారి స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నేరుగా డాక్యుమెంట్‌లు, మీడియాను షేర్ చేయవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : WhatsApp in 2022 : ఈ ఏడాదిలో వాట్సాప్ బెస్ట్ ఫీచర్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?