WhatsApp Paid Subscription : వాట్సాప్‌లో కొత్త పెయిడ్ ఫీచర్.. సింగిల్ అకౌంట్‌తో ఒకేసారి మల్టీ డివైజ్‌ల్లో..!

WhatsApp Paid Subscription : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్‌లో మల్టీ డివైజ్ సపోర్టు ఫీచర్ అందుబాటులో ఉంది.

WhatsApp Paid Subscription : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్‌లో మల్టీ డివైజ్ సపోర్టు ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్.. సింగిల్ అకౌంట్ ద్వారా కేవలం 4 డివైజ్‌లతో మాత్రమే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లేటెస్టుగా మెసేజింగ్ యాప్ దానికి అడ్వాన్స్‌గా పేమెంట్ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. పేయిడ్ సబ్ స్ర్కిప్షన్ (Paid Subscription) ఫీచర్. ఈ కొత్త పెయిడ్ ఫీచర్ ద్వారా సింగిల్ వాట్సాప్ అకౌంట్‌తో 4 డివైజ్‌లు కాదు.. ఎన్ని‌ డివైజ్‌లకైనా సులభంగా కనెక్ట్ కావొచ్చు.

ప్రస్తుతానికి వాట్సాప్ ఈ కొత్త పెయిడ్ ఫీచర్ కోసం టెస్టింగ్ చేస్తున్నట్టు Wabetainfo వెల్లడించింది. ఈ పెయిడ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ యూజర్లు తమ సింగిల్ అకౌంట్ ద్వారా ఎన్ని డివైజ్ ల్లోనైనా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే.. ప్రస్తుతం టాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లకు వాట్సాప్ కనెక్ట్ చేసే వీలుంది. ఇదివరకే ఒక స్మార్ట్ ఫోన్ డివైజ్ యాడ్ అయితే.. రెండో స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేసేందుకు అనుమతించదు. వాట్సాప్ మిమ్మల్ని ఒకేసారి ఒక స్మార్ట్‌ఫోన్‌ను మాత్రమే కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు రాబోయే ఈ కొత్త పెయిడ్ ఫీచర్ వల్ల ప్రయోజనం ఏంటంటే.. మీకు ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. Wabetainfo ప్రకారం.. WhatsApp వ్యాపార వినియోగదారుల కోసం WhatsApp కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ టెస్టింగ్ చేస్తోంది. Linkedin Device సెక్షన్ లో సరికొత్త ఇంటర్‌ఫేస్‌ను రూపొందిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

Whatsapp May Let Users Pair More Devices To A Single Account With Paid Subscription

“WhatsApp ఈ ఇంటర్‌ఫేస్‌లో మల్టీ డివైజ్‌ల కోసం కనెక్టవిటీని తీసుకొస్తోంది. మీ సింగిల్ వాట్సాప్ అకౌంట్ ద్వారా అనేక డివైజ్ లను కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా మీ వ్యాపారంలోని వ్యక్తులతో కలిసి ఒకే చాట్‌లో కస్టమర్‌తో మాట్లాడుకోవచ్చు అని Wabetainfo నివేదించింది. ప్రస్తుత multi-device feature యూజర్లు ఒకే సమయంలో 4 డివైజ్ లను యాక్సెస్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది. ఇక Beta mode యాప్‌ యూజర్లు ఇంటర్నెట్ కనెక్షన్‌ లేకుండానే మీ మెయిన్ వాట్సాప్ అకౌంట్ ఫోన్ అవసరం లేకుండానే WhatsApp డెస్క్‌టాప్ వెర్షన్‌లో లాగిన్ చేయవచ్చు. మల్టీ-డివైస్ ఫీచర్ బీటా వెర్షన్‌ రిలీజ్ చేయడంతో వెబ్ బ్రౌజర్ ద్వారా నేరుగా ఫీచర్‌ను యాక్సెస్ చేసే వ్యక్తుల సంఖ్య భారీగా పెరిగిందని వాట్సాప్ గతంలోనే వెల్లడించింది. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ల కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రిజర్వ్ చేసిందని, వ్యాపారాలకు అదనపు ఫీచర్లను అందజేస్తుందని Wabetainfo నివేదించింది.

ప్రస్తుత మల్టీ డివైజ్ ద్వారా యూజర్లు ఒకేసారి 4 డివైజ్ లను కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో మీరు గరిష్టంగా 10 డివైజ్‌లను లింక్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ ఉచితంగా అందుబాటులో ఉండదని గుర్తించాలి. వాస్తవానికి ఇది పెయిడ్ ఫీచర్ అంటోంది వాట్సాప్. మీరు సబ్ స్ర్కిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా మీకు అదనపు సర్వీసులను కూడా పొందవచ్చు. వాట్సాప్ అందించే అన్ని సర్వీసులు ఉచితంగానే యాక్సస్ చేసుకోవచ్చు. ఈ పెయిడ్ ఫీచర్ కేవలం 10 డివైజ్ లను ఒకసారి కనెక్ట్ చేసుకోవడానికి మాత్రమే అనే విషయం గమనించాలి. వాట్సాప్ అందించే ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వార్షిక లేదా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందిస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Whatsapp New Feature : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఆప్షన్.. మీ స్టేటస్ హైడ్ చేయొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు