WhatsApp : వాట్సాప్ స్టేటస్‌లో ఇకపై వాయిస్ నోట్స్ కూడా షేర్ చేయొచ్చు!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వాయిస్ నోట్ స్టేటస్ ఫీచర్ పై వర్క్ చేస్తోంది.

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. ఇప్పటికే ఎమోజి రియాక్షన్ ఫీచర్లను రిలీజ్ చేసిన వాట్సాప్ ఇప్పుడు వాయిస్ నోట్‌లను స్టేటస్ అప్‌డేట్‌లుగా అందించేందుకు యూజర్లను అనుమతించనుంది. ప్రస్తుతం ఈ వాయిస్ నోట్ స్టేటస్ ఫీచర్ పై వర్క్ చేస్తోంది. ప్రస్తుత వాట్సాప్ యూజర్లు ఫొటోలు, వీడియోలు మాత్రమే స్టేటస్‌లుగా పోస్ట్ చేసేందుకు వీలుంది. వాట్సాప్ రాబోయే ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఆడియో నోట్స్‌ను కూడా స్టేటస్‌లో షేర్ చేయడానికి అనుమతిస్తుంది. WhatsApp ఫీచర్స్ ట్రాకర్ ప్రకారం.. Wabetainfo, WhatsApp లాస్ట్ స్టేటస్‌లలో వాయిస్ నోట్ సపోర్ట్‌ను అందిస్తుంది.

స్టేటస్ అప్‌డేట్‌గా షేర్ చేసిన వాయిస్ నోట్‌ను “Voice Status” అని పిలవవచ్చునని నివేదిక పేర్కొంది. WhatsApp ఫీచర్స్ ట్రాకర్ స్టేటస్‌లలో వాయిస్ నోట్ సపోర్ట్ యాక్టివిటీని వివరిస్తూ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. స్టేటస్ ట్యాబ్ దిగువన కొత్త ఐకాన్ ఉంది. స్టేటస్ అప్‌డేట్‌కు వాయిస్ నోట్‌ను త్వరగా పంపేలా చేస్తుంది. వాయిస్ నోట్ మీ స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్‌లలో మీరు ఎంచుకున్న వ్యక్తులతో మాత్రమే షేర్ అవుతుందని తెలిపింది. వాయిస్ నోట్ మీ స్టేటస్‌కి షేర్ అయిన ఇతర ఇమేజ్‌లు, వీడియోల వలె ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతుందని గుర్తించాలని Wabetainfo నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. బీటా టెస్టర్‌లకు ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు.

Whatsapp May Soon Let Users Put Voice Notes As Status Updates 

వాట్సాప్ మరో యాడ్ ఇన్ మోడ్ ఫీచర్‌పై పని చేస్తోంది. మల్టీ-డివైస్ సపోర్ట్‌ను పోలి ఉంటుంది. కానీ, మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కంపానియన్ మోడ్, ఒకసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. యూజర్లు ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఒక వాట్సాప్ అకౌంట్ వాడేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుత సెటప్ రెండు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఒక అకౌంట్ యాక్సెస్ చేయడానికి యూజర్లను అనుమతించదు. అయితే ఐప్యాడ్, కంప్యూటర్‌ల వంటి ఇతర డివైజ్‌ల నుంచి చేయవచ్చు. Wabetainfo ప్రకారం.. WhatsApp యూజర్లు WhatsApp అకౌంట్ రెండవ ఫోన్‌ను లింక్ చేసేందుకు సులభతరం చేస్తుంది.

మీరు రెండు ఫోన్‌లలో ఒక వాట్సాప్ అకౌంట్ ఉపయోగించవచ్చు. ప్రస్తుత సెటప్ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ను యాక్సెస్ చేసేందుకు యూజర్లను అనుమతించదు. యూజర్లు తమ అకౌంట్లలో డెస్క్‌టాప్, ట్యాబ్‌లు, ఇతర డివైజ్‌ల నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. యూజర్లు డబుల్ మొబైల్ డివైజ్ నుంచి WhatsAppకి లాగిన్ అయినప్పుడు.. వారి చాట్‌లు సురక్షితంగా మరో డివైజ్‌కు కాపీ అవుతాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పట్టవచ్చు. WhatsApp వెబ్/డెస్క్‌టాప్‌లో అందుబాటులో ఉన్న అదే మెసేజ్ సిస్టమ్‌ను యాడ్ చేసేందుకు WhatsApp పని చేస్తోంది.

Read Also : WhatsApp Users : ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్ వార్నింగ్.. భారతీయ యూజర్లు జర భద్రం!

ట్రెండింగ్ వార్తలు