WhatsApp Users : ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్ వార్నింగ్.. భారతీయ యూజర్లు జర భద్రం!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లను గట్టిగా హెచ్చరిస్తోంది. ప్రత్యేకించి భారతీయ వాట్సాప్ యూజర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

WhatsApp Users : ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్ వార్నింగ్.. భారతీయ యూజర్లు జర భద్రం!

Whatsapp Head Issues Warning To Users, Indians Using App On Android Must Take Note

WhatsApp Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లను గట్టిగా హెచ్చరిస్తోంది. ప్రత్యేకించి భారతీయ వాట్సాప్ యూజర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. మెసేజింగ్ యాప్ ఫేక్ వెర్షన్‌ల గురించి తెలుసుకోవాలని యూజర్లకు సూచిస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ CEO, విల్ క్యాత్‌కార్ట్ (Will Cathcart) యూజర్లు చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని వాట్సాప్ సీఈఓ హెచ్చరిస్తున్నారు. WhatsApp మాడిఫైడ్ వెర్షన్లను అసలే వాడొద్దని ట్విట్టర్‌ వేదికగా ఆయన అభ్యర్థిస్తున్నారు. WhatsApp అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. అలాంటి మెసేజింగ్ యాప్ టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు, స్కామర్‌లు వివిధ పద్ధతుల ద్వారా యూజర్ల డేటాను తస్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ తరహాలో సర్వీసులను అందిస్తున్నట్లుగా కొన్ని హానికరమైన యాప్‌లను కంపెనీకి చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ గుర్తించింది.

Whatsapp Head Issues Warning To Users, Indians Using App On Android Must Take Note (1)

Whatsapp Head Issues Warning To Users, Indians Using App On Android Must Take Note

“HeyMods” అనే డెవలపర్ నుంచి వచ్చిన “Hey WhatsApp” వంటి యాప్‌లు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. ఇలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేయొద్దని Cathcart సూచించింది. ఈ యాప్‌ల ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కొన్ని కొత్త ఫీచర్‌లను అందిస్తామని ఆఫర్ చేస్తున్నాయని రీసెర్చ్ బృందం గుర్తించింది. అంటే.. యూజర్ల ఫోన్‌లలో స్టోర్ చేసిన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే స్కామ్ మాత్రమేనని రీసెర్చ్ టీం హెచ్చరిస్తోంది. WhatsApp మాడిఫైడ్ లేదా ఫేక్ వెర్షన్లను WhatsApp మాదిరిగానే ఫీచర్‌లను అందిస్తున్నాయి. అయితే మెసేజింగ్ యాప్ రియల్ వెర్షన్‌తో వచ్చే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ మాత్రం అందులో ఉండవని హెచ్చరిస్తోంది. ఇలాంటి యాప్స్ వాడటం ద్వారా మీ చాట్‌లు, వ్యక్తిగత డేటాను ప్రొటెక్ట్ చేయలేమని అంటోంది. అదే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ ఉంటే.. మీ వివరాలను ఎవరూ యాక్సెస్ చేయలేరని, WhatsApp కూడా చేయలేదని రీసెర్చ్ టీమ్ స్పష్టంచేసింది.

WhatsApp కొత్త ఫేక్ వెర్షన్ ప్లే స్టోర్‌లో ఉండవు. దాంతో చాలామంది యూజర్లు అనధికారిక వెబ్ సైట్ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయా యాప్స్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. WhatsApp అధికారిక వెర్షన్‌ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా లేదా Google Play Store వంటి విశ్వసనీయ యాప్ స్టోర్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని యూజర్లకు సూచిస్తున్నారు వాట్సాప్ సీఈఓ. ఈ రకమైన యాప్‌లను గుర్తించి బ్లాక్ చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి యాప్స్ ద్వారా యూజర్లకు ఎలాంటి సమస్య లేకుండా ఉండేలా HeyModsపై చర్యలు తీసుకోనున్నామని తెలిపారు.

Read Also : WhatsApp Two Phones : వాట్సాప్‌లో మరో మల్టీ-డివైస్ ఫీచర్.. రెండు ఫోన్లలో ఒకే అకౌంట్ వాడొచ్చు!