WhatsApp: వాట్సప్ ఆన్‌లైన్‌లో ఉండికూడా హైడ్ చేసుకోవచ్చు

వాట్సప్ వాడుతున్న సమయంలో ఇతరులకు మనం ఆన్ లైన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా ఆ విషయం ఎవరికీ తెలియకూడదని భావించినా స్టేటస్ ను బట్టి దొరికిపోతాం. రీసెంట్ గా వాట్సప్ తమ యూజర్ల కోసం తీసుకొస్తున్న ఫీచర్ తో ఆన్ లైన్ లో ఉన్నా.. తెలియకుండా హైడింగ్ ఆప్షన్ తీసుకురానుంది.

WhatsApp: వాట్సప్ వాడుతున్న సమయంలో ఇతరులకు మనం ఆన్ లైన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా ఆ విషయం ఎవరికీ తెలియకూడదని భావించినా స్టేటస్ ను బట్టి దొరికిపోతాం. రీసెంట్ గా వాట్సప్ తమ యూజర్ల కోసం తీసుకొస్తున్న ఫీచర్ తో ఆన్ లైన్ లో ఉన్నా.. తెలియకుండా హైడింగ్ ఆప్షన్ తీసుకురానుంది.

యూజర్లు ఆన్ లైన్ ఆన్‌లైన్ స్టేటస్‌ను దాచడానికి వీలుగా ఆప్షన్‌ను జోడించడంపై WhatsApp ఫోకస్ పెట్టింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌తో ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరు చూడగలరో వారికి మాత్రమే కనిపించేలా సెలక్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ అప్‌డేట్‌లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

యాజమాన్య కంపెనీ మెటా కొంతమంది బీటా టెస్టర్‌ల కోసం మెసేజ్ లను డిలీట్ చేయడానికి టైం వ్యాలిడిటీ అప్‌డేట్ చేస్తున్నట్లు పేర్కొంది. Google Play బీటా ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో ఉన్న Android బీటా 2.22.15.8 కోసం WhatsAppలో ఈ ఫీచర్ వర్తిస్తుంది. వాట్సాప్ విండోస్ బీటాలో పూర్తి ఫంక్షనల్ కాంటెక్స్ట్ మెనూని కూడా విడుదల చేస్తుందని తెలిపింది.

Read Also: వాట్సప్ లేటెస్ట్ అప్‌డేట్.. ఒక్క గ్రూపుకు 512మంది

WhatsApp ఫీచర్స్ ట్రాకర్ WABetaInfo వివరాల ప్రకారం , సెలక్ట్ చేసిన కాంటాక్ట్ ల ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేయగల సామర్థ్యాన్ని డెవలప్ చేస్తోంది. రిలీజ్ అయ్యాక ఈ ఫీచర్ వినియోగదారులు WhatsApp ప్రైవసీ సెట్టింగ్‌లలో ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరు చూడవచ్చో ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు