వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ప్రైవేట్ చాట్స్‌లో మెసేజ్‌లు పంపుకోవచ్చు!

సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ నిర్దిష్టమైన సమయంలో ఆటోమాటిక్ చాట్ మెసేజ్ లను డిలీట్ చేసేస్తుంది. దాన్నే Disappearing Messages అని పిలుస్తారు. తొలుత ఈ ఫీచర్ WaBetaInfoలో కనిపించింది. దీని రిపోర్టు ప్రకారం.. వాట్సాప్ కొత్త బీటా అప్ డేట్ 2.19.275 వెర్షన్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తీసుకోస్తోంది.

భవిష్యత్తులో డిలీట్ ఫీచర్ అందరికి అందుబాటులోకి రానుంది. ఈ disappearing messages ఫీచర్ తొలుత గ్రూపు చాట్స్‌లో రానుంది. వాస్తవానికి ఈ ఫీచర్ కేవలం గ్రూపు అడ్మిన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు.. ప్రైవేట్ చాట్స్ లో కూడా ఫీచర్ రానుంది. గ్రూపు సెట్టింగ్స్ లో డిలీట్ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు.

ఇక్కడ యూజర్లు నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకోవచ్చు. 5 సెకన్ల నుంచి 1 గంటల వరకు ఉండేలా టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఫీచర్ ఎనేబుల్ అయితే చాలు.. సెట్ చేసిన సమయానికి ఆటోమాటిక్ గా చాట్ మెసేజ్ అదృశమైపోతుంది. అంటే.. యూజర్లు మెసేజ్ ఎక్స్ పెయిరీ టైమ్ ప్రత్యేకించి లేదా వ్యక్తిగత మెసేజ్ ఎంచుకునే అవకాశం లేదు. డెవలప్ మెంట్ స్టేజీలో ఉన్న ఈ డిలీట్ ఫీచర్.. ఆండ్రాయిడ్ వెర్షన్ బీటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్ కనిపించింది.

ఐఓఎస్ యూజర్లకు కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. మరోవైపు వాట్సాప్ ఆండ్రాయిడ్ డివైజ్ ల కోసం మరో బీటా అప్ డేట్ ప్రవేశపెట్టబోతోంది. అదే.. డార్క్ థీమ్ అప్‌డేట్.. ప్రస్తుతానికి వాట్సాప్ లో థీమ్ అందుబాటులో లేదు. ఒకసారి ఇది అప్ డేట్ అయ్యాక ఆండ్రాయిడ్ సిస్టమ్ లో లైట్ లేదా డార్క్ థీమ్ ఆటోమాటిక్ గా అప్ డేట్ అయిపోతుంది.