Whatsapp Status
Whatsapp Status : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ అద్భుతమైన కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. యూజర్లు వాట్సాప్ స్టేటస్‌పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను సులభంగా షేర్ చేయవచ్చు. గత కొన్ని ఏళ్లుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. రీల్స్ చూసేందుకు వినియోగదారులు కూడా చాలా ఆసక్తి చూపిస్తుంటారు. గంటల తరబడి ఫీడ్ ద్వారా స్క్రోల్ చేస్తూ రీల్స్ చూస్తూనే ఉంటారు.
Read Also : Samsung Galaxy S24 Ultra 5G : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఎంతంటే?
కొన్నిసార్లు ఏదైనా రీల్‌ను బాగా నచ్చితే వెంటనే DMలలో లేదా స్టోరీలో షేర్ చేస్తుంటారు. ఈ కొత్త అప్‌డేట్‌తో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు కూడా వాట్సాప్ స్టేటస్‌లో నేరుగా ఏదైనా రీల్‌ను షేర్ చేసుకోవచ్చు. వాస్తవానికి, గతంలో వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేసిన తర్వాత వీడియో ప్లే అవుతుంది. కానీ, ఆ రీల్ ఆడియో వినిపించదు. ఈ కొత్త అప్‌డేట్‌తో ఆ ఇష్యూ ఫిక్స్ అయింది. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లో రీల్స్ ఆడియోతో ప్లే అవుతాయి అనమాట.
వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను ఇలా షేర్ చేయండి :
1. ముందుగా (Instagram) యాప్‌ను ఓపెన్ చేయండి.
2. ఇప్పుడు మీరు షేర్ చేసే రీల్‌ను ఎంచుకోండి.
3. రీల్ కింద ఉన్న ‘Share’ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
4. ఆప్షన్లలో WhatsApp, WhatsApp Status ఆప్షన్ ఎంచుకోండి.
5. వాట్సాప్ స్టేటస్‌పై ట్యాప్ చేయండి. రీల్‌ను నేరుగా మీ స్టేటస్‌కు యాడ్ చేయండి.
6. మీ రీల్, ఆడియోతో పాటు, మీ వాట్సాప్ స్టేటస్‌లో షేర్ అవుతుంది.
వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను క్రియేట్ చేసేవారికి బెనిఫిట్స్ అని చెప్పవచ్చు. రీల్స్ వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు వీలుంటుంది. క్రియేట్ చేసిన రీల్స్‌ను నేరుగా వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయడం ద్వారా స్నేహితులు, ఇతర కాంటాక్టులతో సులభంగా ఎంగేజ్ అవ్వొచ్చు. అంతేకాదు.. ఎడిటింగ్ లేదా డౌన్‌లోడ్ గురించి కూడా బాధపడాల్సిన పనిలేదు.