Whatsapp Tips Here's How To Pay Payment Or Create Account On Whatsapp Pay
WhatsApp Tips : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ద్వారా ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ in-chat payment అనే టూల్ ప్రవేశపెట్టింది. ఈ టూల్ UP ఆధారిత పేమెంట్ ఆప్షన్ కలిగి ఉంటుంది. దీనిద్వారా వాట్సాప్ పేమెంట్స్ పంపుకోవచ్చు. మీ వాట్సాప్ కాంటాక్టు లిస్టులోని వారికి డబ్బు పంపడం లేదా వారి నుంచి కూడా పొందే అవకాశం ఉంది. ఈ టూల్ వర్క్ చేయాలంటే ముందుగా మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా డెవలప్ చేసిన WhatsApp Pay యాక్టివేట్ చేసుకోవాలి.
ఈ ఫీచర్ ఫిబ్రవరి 2018లో ట్రయల్ రన్‌గా భారతదేశంలో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 7, 2020న WhatsApp డిజిటల్ పేమెంట్ సర్వీసును దశలవారీగా ప్రారంభించేందుకు NPCI ద్వారా ఆమోదం లభించింది. వాట్సాప్ పేమెంట్ సర్వీసు ప్రారంభంలో దేశంలో 10 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. WhatsApp Pay ద్వారా పేమెంట్స్ చేయాలంటే ముందుగా డబ్బు పంపే వ్యక్తి నుంచి రిక్వెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాతే యూజర్ Whatsapp వారి అకౌంట్లో UPI సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూల్ ద్వారా WhatsApp Pay యూజర్లు తమ కాంటాక్ట్‌లలో ఎవరికైనా డబ్బు పంపేందుకు అనుమతినిస్తుంది.
ఇక్కడే మీరు UPI IDని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. Whatsapp Pay యూజర్లు తమ UPI IDని నమోదు చేయడం ద్వారా డబ్బు పంపవచ్చు. యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులకు డబ్బు పంపడానికి QR కోడ్ ద్వారా కూడా యాక్సస్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు వాట్సాప్ చాట్ ద్వారా నేరుగా మనీ పంపుకోవచ్చు. చాట్‌లో అటాచ్‌మెంట్ ఆప్షన్ దగ్గరే ఒక రూపాయి సింబల్ ఉంటుంది. మెసేజింగ్ సాఫ్ట్‌వేర్ యూజర్లు తమ డబ్బును పంపుకోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ యూజర్లు WhatsApp Payments Account కు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను లింక్ చేయవచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను యాడ్ చేస్తే.. అందులో మీ ప్రైమరీ బ్యాంకు అకౌంట్ అనేది సెట్ చేసుకోవాలి. WhatsApp పేమెంట్ హాఫ్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ లేదా అన్ని బ్యాంక్ అకౌంట్లను డీయాక్టివేట్ చేయవచ్చు.
వాట్సాప్ పేమెంట్స్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే? :
వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను అప్ డేట్ చేయండి.
వాట్సాప్ ఓపెన్ చేయండి.. స్క్రీన్ టాప్ రైట్ కార్నర్‌లో త్రి డాట్స్‌పై క్లిక్ చేయండి.
Paymentsపై క్లిక్ చేయండి. ఆ తర్వాత పేమెంట్ మోడ్ ఎంచుకోండి.
మీ బ్యాంక్ పేరును ఎంచుకోండి. బ్యాంకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ తో వెరిఫై చేసుకోవాలి.
SMS ద్వారా కన్ఫర్మ్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసి మీ వాట్సాప్ నంబర్ ధ్రువీకరించాలి.
అనంతరం మీరు పేమెంట్స్ సెటప్ చేయాలి. ట్రాన్సాక్షన్ చేసేందుకు UPI PIN ఏర్పాటు చేయాలి.
మీరు పేమెంట్ పేజీలో ఏదైనా బ్యాంకును ఎంచుకోవచ్చు.
పేమెంట్ చేయాలంటే….
WhatsAppను ఓపెన్ చేయండి. సెట్టింగ్‌ల మెనుకి వెళ్లండి.
సెట్టింగ్‌ల మెనులో Payments క్లిక్ చేయండి.
ఆ బటన్ నొక్కడం ద్వారా బ్యాంక్ అకౌంట్ ఎంచుకోవచ్చు.
ఇక్కడ మీకు డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది.
ప్రైమరీ అకౌంట్ ఎంచుకున్నాక పేమెట్ చేయడమే..