WhatsApp Group: స్టూడెంట్స్ కంట్రోలింగ్ కోసం పేరెంట్స్ అందరికీ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసిన కాలేజ్ మేనేజ్మెంట్

స్టూడెంట్స్ ను క్రమశిక్షణ పెట్టే క్రమంలో పేరెంట్స్ అందరికీ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసింది కాలేజ్ మేనేజ్మెంట్. రెగ్యూలర్ గా కాలేజీలకు వస్తున్నారా లేదా అనేది ఆ గ్రూప్ లో ఇన్ఫామ్....

WhatsApp Group: స్టూడెంట్స్ కంట్రోలింగ్ కోసం పేరెంట్స్ అందరికీ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసిన కాలేజ్ మేనేజ్మెంట్

Whatsapp Subhan !0tv

WhatsApp Group: స్టూడెంట్స్ ను క్రమశిక్షణ పెట్టే క్రమంలో పేరెంట్స్ అందరికీ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసింది కాలేజ్ మేనేజ్మెంట్. రెగ్యూలర్ గా కాలేజీలకు వస్తున్నారా లేదా అనేది ఆ గ్రూప్ లో ఇన్ఫామ్ చేసి పేరెంట్స్ కు తెలియజేస్తున్నారట.

‘కాలేజీలకు బంక్ కొట్టడం అనేది తల్లిదండ్రుల సమస్య. స్టూడెంట్స్ లో క్రమిశిక్షణ సృష్టించాలనుకుంటున్నాం. మా ఫ్యాకల్టీ మెంబర్స్ వాట్సప్ లో పేరెంట్స్ అందరి కోసం ఓ గ్రూప్ ను క్రియేట్ చేసి… క్రమశిక్షణారాహిత్యంతో ప్రవర్తించే వారిని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని’ పీఎంసీహెచ్ ప్రిన్సిపాల్ విద్యాపతి చౌదరి అన్నారు.

కాలేజిలోని సైకాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ రాజీవ్ కుమార్ సింగ్ ఈ గ్రూపుకు అడ్మిన్ గా వ్యవహరిస్తున్నారు.

Read Also: తొలి మహిళా యూనివర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజ్..!

స్టూడెంట్స్ ఇతర యాక్టివిటీలు చేస్తుంటే పేరెంట్స్‌కు ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత ఫ్యాకల్టీదే. ప్రతిసారి విద్యా సంవత్సరం పూర్తయ్యే సమయానికి చాలా మంది పొలిటిషియన్ల నుంచి స్టూడెంట్ల గైర్హాజరీ గురించి కాల్స్ వస్తున్నాయి. అది మంచి పరిస్థితి కాదు. అందుకే ముందు నుంచే పేరెంట్స్ కు విషయం తెలియాలని ఈ ఏర్పాటు చేశాం’ అని ప్రిన్సిపాల్ అంటున్నారు.

మెడికల్ కరికులంను కంట్రోల్ చేసే నేషనల్ మెడికల్ కమిషన్ ప్రాక్టికల్స్ కు 80శాతం అటెండెన్స్, థియరీ క్లాసులకు 75శాతం అటెండెన్స్ ఉంటేనే పరీక్షలు రాసేందుకు అర్హులని తెలిపింది.