WhatsApp Tips : వాట్సాప్ మెసేజ్‌లను త్వరగా ఎలా ఎడిట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్స్..!

WhatsApp Tips : వాట్సాప్ సూపర్ పర్సనల్ చాట్‌లను లాక్ చేయడం, మల్టీ ఫోన్‌లలో లాగిన్ చేయడం వంటి ఫీచర్‌లతో పాటు మెసేజ్‌లను ఎడిట్ చేయగల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

WhatsApp Tips _ How to quickly edit messages on the app

WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) సూపర్ పర్సనల్ చాట్‌లను లాక్ చేసేందుకు మల్టీ ఫోన్‌లలో వాట్సాప్ లాగిన్ చేయడానికి అనుమతించే ఆప్షన్ వంటి ఫీచర్‌లతో పాటు మెసేజ్‌లను ఎడిట్ చేయగల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. లేటెస్ట్ ఎడిట్ బటన్ వాట్సాప్ యూజర్లు మెసేజ్ మార్పులు చేసేందుకు అనుమతిస్తుంది. కానీ, నిర్దిష్ట సమయ లిమిట్ ఉంది. ఎప్పుడైనా ఫీచర్‌ని ఎడిట్ చేయలేరు. అక్షర దోషాలు అయినా, తప్పుగా పదం అయినా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎడిట్ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంటుంది.

మీరు వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌లో లేకుంటే.. మీరు ఎడిట్ మెసేజ్ అందుకోలేరు. వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌లో ఈ చాట్‌లోని ప్రతి యూజర్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన మెసేజ్‌లను చూసేందుకు మీరు యాప్‌ని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ డిలీట్ ఆప్షన్‌ని ఉపయోగించడం కన్నా మెరుగ్గా ఉంటుంది.

Read Also : WhatsApp New Update : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఐఫోన్ యూజర్లు స్టిక్కర్లు, అవతార్స్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు..!

ఎందుకంటే.. వాట్సాప్ యూజర్లు మొత్తం మెసేజ్‌ని డిలీట్ చేసి మళ్లీ రాయడానికి బదులుగా కొన్ని లోపాలను త్వరగా ఎడిట్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లకు రెండు ఆప్షన్లను అందిస్తుంది. అందులో ఒకటి ఎప్పుడైనా మెసేజ్ డిలీట్ చేయడానికి ఎంచుకోవచ్చు. మీరు యాప్‌లో మెసేజ్ త్వరగా ఎలా ఎడిట్ చేసుకోవచ్చు.

పొరపాటున పంపిన మెసేజ్‌లను ఎలా ఎడిట్ చేయాలి :
* వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేసి ఏదైనా చాట్‌కి వెళ్లండి.
* మీరు పొరపాటున పంపిన మెసేజ్ ఎక్కువసేపు నొక్కితే చాలు.
* ఇప్పుడు ఎడిట్ మెసేజ్ ఆప్షన్ పొందవచ్చు.
* టెక్స్ట్‌ను మార్చడానికి దానిపై నొక్కాలి.
* అంతే.. టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడమే.

WhatsApp Tips _ How to quickly edit messages on the app

ఎడిట్ చేసే ముందు ఏం గుర్తుంచుకోవాలి? :
మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మీ మెసేజ్ ఎడిట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతించడానికి మీకు 15 నిమిషాల విండోను మాత్రమే ఇస్తుందని గుర్తుంచుకోండి. ఆ తర్వాత, మెసేజ్ ఎడిట్ చేయడానికి ఎలాంటి ఆప్షన్ ఉండదు. మీరు అనుకోకుండా మీ టెక్స్ట్‌లో పొరపాటు చేస్తే.. మీరు మెసేజ్ డిలీట్ చేయాల్సి ఉంటుంది.

మెసేజ్‌ని ఎడిట్ చేస్తే.. మీ చాట్‌లోని వ్యక్తులకు కొత్త చాట్ నోటిఫికేషన్ పోదని గుర్తుంచుకోండి. అంటే మీరు అలా చేస్తే తప్ప మీరు మెసేజ్ మార్చారా లేదా ఎడిట్ చేశారా? అనేది పొందిన వ్యక్తులకు తెలియదని అర్థం. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఫోటోలు, వీడియోలు లేదా ఇతర రకాల మీడియా లేదా క్యాప్షన్‌లను ఎడిట్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్ iOS, Android యూజర్లకు అందుబాటులో ఉంది.

Read Also : OnePlus vs iQoo : వన్‌ప్లస్ నార్డ్ 3 vs ఐక్యూ నియో 7 ప్రో.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఇందులో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?