×
Ad

WhatsApp Username : వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే చాట్ చేయొచ్చు.. ఫుల్ డిటెయిల్స్!

WhatsApp Username : వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. మొబైల్ నంబర్‌ షేర్ చేయకుండానే చాట్ చేసుకోవచ్చు.

WhatsApp Username

WhatsApp Username : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ వచ్చేస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే స్పెషల్ యూజర్ నేమ్ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ రివీల్ కాకుండానే ఇతరులతో చాట్ చేయొచ్చు. ఈ లేటెస్ట్ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది.

ఇప్పుడు వాట్సాప్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ (2.25.28.12)లో గుర్తించారు. వాట్సాప్ యూజర్లు (WhatsApp Username) ఇన్‌స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్‌లలో మాదిరిగా యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకోవచ్చు. తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటాలో అందుబాటులో ఉంది. అతి త్వరలో రెగ్యులర్ వాట్సాప్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

యూజర్ నేమ్ క్రియేషన్ కోసం కొత్త రూల్స్ ఇవే :
వాట్సాప్ యూజర్‌నేమ్ క్రియేట్ చేసేందుకు నిర్దిష్ట మార్గదర్శకాలను అందిస్తోంది.

  • యూజర్ నేమ్‌లో “www” అనే లెటర్స్ ఉండకూడదు.
  • కనీసం ఒక అక్షరమైనా ఉండాలి.
  • అల్ఫబెట్‌తో పాటు సంఖ్యలు, అండర్ స్కోర్‌లు ఉండొచ్చు.

బీటా టెస్టింగ్‌లో యూజర్ నేమ్ ఫీచర్ :

ప్రస్తుతానికి, ఈ కొత్త యూజర్‌నేమ్ ఫీచర్ ఆండ్రాయిడ్‌లోని లిమిటెడ్ బీటా యూజర్ల గ్రూపుతో టెస్టింగ్ జరుగుతోంది. ఇంకా గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ కింద ఉన్న యూజర్లందరికి ఇంకా అందుబాటులోకి రాలేదు. నివేదిక ప్రకారం.. వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌ను త్వరలో మరిన్ని బీటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెగ్యులర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Read Also : EPFO Pension : దీపావళికి ముందు PF ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై నెలకు రూ.7,500 పెన్షన్..? ఎప్పటినుంచో తెలుసా?

యూజర్ నేమ్ రిజర్వ్ ఆప్షన్ :
వాట్సాప్ ఇప్పుడు వినియోగదారుల కోసం హ్యాండిల్ లేదా యూజర్ నేమ్ రిజర్వ్ చేసుకునేందుకు ఆప్షన్ అందిస్తుంది. యాప్ సెట్టింగ్‌లలో మీకు నచ్చిన యూజర్ నేమ్‌ను మీరు ఎంచుకోవచ్చు. ఒకసారి రిజర్వ్ చేసుకున్నాక మరే ఇతర యూజర్ ఈ యూజర్ నేమ్ ఉపయోగించలేరు.

ఈ ఫీచర్ ఇప్పటికే సిగ్నల్, టెలిగ్రామ్, ఐమెసేజ్ వంటి యాప్‌లలో అందుబాటులో ఉంది. ఈ యాప్‌లలో, వ్యక్తులు యూజర్ నేమ్ లేదా ఇమెయిల్ ఉపయోగించి కూడా కనెక్ట్ కావచ్చు. యూజర్‌నేమ్‌లతో పాటు ప్రొఫైల్ ప్రొటెక్షన్ కోసం పిన్‌ కూడా సెట్ చేసుకోవచ్చు. కొత్త సెక్యూరిటీ ఫీచర్లపై కూడా వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది.

కొత్త ఫీచర్ బెనిఫిట్స్ ఏంటి?:
ఇప్పటివరకు, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు మొబైల్ నంబర్‌ మాత్రమే అవసరం. ఈ విధానం చాలా ఈజీగా ఉంటుంది. కానీ, ప్రైవసీ పరంగా ఇబ్బందిని కలిగిస్తుంది. మీకు తెలియని వ్యక్తులు మీ నంబర్‌ను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు.. మీ ఫోన్ నంబర్‌ను మార్చవలసి వస్తే.. మీ అకౌంట్ ట్రాన్స్‌లేట్ చేయడం కష్టంగా ఉంటుంది. కానీ, ఇప్పుడు యూజర్ నేమ్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను మార్చకుండానే తమ అకౌంట్ ఈజీగా వినియోగించుకోవచ్చు.