WhatsApp Voice Feature: వాట్సప్ వాయీస్ మెసేజ్‌ల కోసం కొత్త ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకూ ఫేస్ బుక్ లో వాయీస్ రికార్డ్ చేసి పంపడం, అది విని వద్దనుకుంటే డిలీట్ చేయడం అమల్లో ఉంది.

WhatsApp Voice Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకూ ఫేస్ బుక్ లో వాయీస్ రికార్డ్ చేసి పంపడం, అది విని వద్దనుకుంటే డిలీట్ చేయడం అమల్లో ఉంది. ఇప్పుడు వాట్సప్ లో వచ్చే ఫీచర్ కూడా దానికి దగ్గర్లోనే ఉంది. రికార్డింగ్ ను పాస్ చేసి మళ్లీ రికార్డ్ చేసుకుని పూర్తయ్యాక పంపుకోవచ్చు.

వాట్సప్ బీటా ఐఓఎస్, యాండ్రాయిడ్ ప్లాట్ ఫాంలలో దీనిని రిలీజ్ చేయనున్నారు. ఈ మేర WABetainfo ప్రకటన చేసింది. ఫ్యూచర్ అప్ డేట్ కోసం వెయిట్ చేయండి. పబ్లిక్ బీటా టెస్టర్లకు ఇది అందుబాటులో లేదు. టెస్టింగ్ తర్వాత యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుందా.. లేదా అని వేచి చూడాలి.

…………………………………….: మణిశర్మ తనయుడి నిశ్చితార్థం ప్రముఖ సింగర్ తో..

వాట్సప్ అప్‌డేట్స్ లో చెప్పిన దాని ప్రకారం.. వాయీస్ మెసేజ్ రికార్డ్ చేయడానికి ఒక బటన్, పాస్ చేయడానికి ఒక బటన్, ఆ తర్వాత రెజ్యూమ్ అవడానికి ఇంకో బటన్. అదే కాకుండా డిలీట్, సెండ్ బటన్స్ కూడా ఉపయోగించి ఆడియో మెసేజ్ ను ఆపరేట్ చేయొచ్చు.

 

కమ్యూనిటీ గ్రూప్ ఫీచర్:
త్వరలో వాట్సప్ కమ్యూనిటీ గ్రూప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్ ని ఏర్పాటు చేసుకోవచ్చని WABeta వెల్లడించింది. గ్రూప్ అడ్మిన్ తరహాలోనే కమ్యూనిటీలను నిర్వహించే వారిని కమ్యూనిటీ మేనేజర్స్ అని పిలుస్తారని సమాచారం. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ సమాచారాన్ని ఎక్కువమందితో పంచుకోగలరని పేర్కొన్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్ లలో ఈ ఫీచర్ అమల్లో ఉంది.

ట్రెండింగ్ వార్తలు