Whatsapp: ఈ ఐఫోన్లలో వాట్సప్ ఇక పనిచేయనట్లే

మెటా కంపెనీకి చెందిన పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. ఇకపై iOS10, iOS11, iPhone 5, iPhone 5C ఫోన్లలో ప్రస్తుత ఏడాది అక్టోబర్ 24నుంచి పనిచేయవని వెల్లడించింది.

 

 

Whatsapp: మెటా కంపెనీకి చెందిన పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. ఇకపై iOS10, iOS11, iPhone 5, iPhone 5C ఫోన్లలో ప్రస్తుత ఏడాది అక్టోబర్ 24నుంచి పనిచేయవని వెల్లడించింది.

యాప్ ఫీచర్‌లను పూర్తిగా ఆస్వాదించడానికి iOS 12ఫోన్ అంతకంటే పైన మోడల్స్‌కు మాత్రమే వీలుంది. కొత్త మార్పులను అప్‌గ్రేడ్ చేయడానికి, అమలు చేయడానికి, ప్లాట్‌ఫారమ్ భద్రతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ అప్‌డేట్ కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్‌ల వినియోగదారులకు WhatsApp ఫీచర్లు అందుబాటులో ఉండవు. ఇప్పటికీ పాత iOS వెర్షన్‌లను వాడుతున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Read Also : వాట్సప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్

iOS 10, iOS 11లో పనిచేసే పరికరాలు ఆ తర్వాత అన్ని ఫీచర్‌లతో సరిగ్గా పనిచేయవు. అప్‌డేట్ ఫలితంగా iOS 10, iOS 11లోని వినియోగదారులు ఇకపై యాప్ స్టోర్ నుండి WhatsAppని ఇన్‌స్టాల్ చేయలేరు.

ట్రెండింగ్ వార్తలు