2020 రికార్డ్: పదివేల కోట్ల మంది ఫార్వార్డ్ చేసిన మెసేజ్

2020 రికార్డ్: పదివేల కోట్ల మంది ఫార్వార్డ్ చేసిన మెసేజ్

Updated On : January 3, 2020 / 9:27 AM IST

కమ్యూనికేషన్ కోసమే స్టార్ట్ అయిన సోషల్ మీడియా పండగలకు, కాలక్షేపాలకు మెయిన్ సోర్సుగా మారిపోయింది. ఎలాంటి అప్‌డేట్ అయినా.. ఎటువంటి ప్రత్యేకమైనరోజు అయినా సోషల్ మీడియాలోనే ఫ్యామస్ అవుతుంది. వాట్సప్ స్టేటస్, ఫేస్‌బుక్ పోస్టు, ఇనిస్టాగ్రామ్ స్టోరీ ఇలా జనరేషన్ అంతా సోషల్ మీడియా ట్రెండింగ్‌తో దూసుకుపోతున్నారు. 

ఇక రెండు రోజుల ముందు ముగిసిన న్యూ ఇయర్ వెల్‌కమ్ విషెస్ కోసం.. వాట్సప్‌లో 10 వేల కోట్ల మంది ఈ మెసేజ్ ను ఫార్వార్డ్ చేశారట. డిసెంబరు 31 సాయంత్రం నుంచి జనవరి 1వరకూ వాట్సప్‌లో న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్తూ 100బిలియన్ల మంది అంటే పదివేల కోట్ల మంది మెసేజ్ లు ఫార్వార్డ్ చేశారు. ఇందులో 12వందల కోట్ల మంది ఫొటోలతో మెసేజ్ లు పంపుకున్నారంట. 

వీరందరిలో కేవలం భారత యూజర్లే 20 వందల కోట్ల మంది ఉండటం విశేషం. ఇందులో ఆశ్చర్యపడే మరో విషయమేమిటంటే.. సోషల్ మీడియాలన్నింటిలో న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి ఎక్కువగా వాట్సప్‌నే వాడుకున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ వినియోగదారులలో ఇండియన్సే ఎక్కువగా ఉన్నారట. 

పది సంవత్సరాల క్రితం అడుగుపెట్టిన వాట్సప్.. ఫేస్‌బుక్‌కు పోటీగా ఎదిగి అదే సంస్థ కోసం పనిచేస్తుంది. పిక్చర్ మెసేజింగ్, టెక్స్ట్ మెసేజింగ్, స్టేటస్, వాయీస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఫీచర్లతో యూజర్లకు దగ్గరగా ఉంటుందీ వాట్సప్. స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ మోడల్ నుంచి హై ఎండ్ మొబైల్ వరకూ వాట్సప్ లేని మొబైల్ ఉండటం కష్టమేనేమో..!