Encryption Key : వాట్సాప్ యూజర్లు.. మీ చాట్ బ్యాకప్ ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్‌లో మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్ యాడ్ అయింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్ డేటాను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

WhatsApp users protect chat backups with end-to-end encryption  : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్‌లో మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్ యాడ్ అయింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్ డేటాను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే.. end-to-end encryption చేసుకోవచ్చు. వాట్సాప్ చాట్ డేటా Google Drive, iCloud ప్లాట్ ఫాంల్లో స్టోర్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ గూగుల్ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. అదే ఐఫోన్ అయితే ఐక్లౌడ్ లో డేటా స్టోర్ అవుతుంది. Chat Backups డేటాను ఇకపై వాట్సాప్ యూజర్లు end-to-end encryption చేసుకోవచ్చు. మీ డేటాను ఎవరూ కూడా యాక్సస్ చేసుకోలేరు. వాట్సాప్ మాత్రమే కాదు.. ఫేస్ బుక్ కూడా యాక్సస్ చేయలేదు. ఈ కొత్త ఫీచర్ డెవలప్ మెంట్ పై ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఇటీవలే ప్రకటించారు.
Delhi HC : ఆధార్ సంఖ్యను మార్చవచ్చా ? కుదరదన్న UIDAI

వాట్సాప్ ప్లాట్ ఫాంపై యూజర్ల ప్రైవసీతో పాటు మరింత సెక్యూరిటీని అందించేందుకు end-to-end encryption ఆప్షన్ తీసుకొచ్చింది. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు తమ చాట్ బాకప్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ డ్రైవ్ ఎంచుకునే ముందు end-to-end encryption ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ ఇంకా రెగ్యులర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రాలేదు.

ఒకసారి ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గూగుల్ లేదా ఆపిల్ ఈ బ్యాకప్ ఎన్ క్రిప్షన్ కీ యాక్సస్ చేసుకునే వీలుంది. వాట్సాప్ మొత్తం ప్లాట్ ఫాంపై ఎన్ క్రిప్షన్ కీ స్టోరేజీ డెవలప్ చేసినట్టు మెసేజింగ్ యాప్ రివీల్ చేసింది. ఈ స్టోరేజీ సెక్యూరిటీ సిస్టమ్ iOS, Android రెండు ప్లాట్ ఫాంలపై పనిచేసేలా రూపొందించారు. ఈ రెండింటీ బ్యాకప్స్ యూనిక్ ఎన్ క్రిప్టెడ్ కీతో మరింత సెక్యూర్ గా ఉండనున్నాయి.

వాట్సాప్ యూజర్లు తమ బ్యాకప్ డేటాను మ్యానువల్ గా కూడా సెక్యూర్ చేసుకోవచ్చు. ఒక కీ పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్ వర్డ్ సెట్ చేయగానే వాట్సాప్ చాట్ బ్యాకప్ కీ వాల్ట్ లో స్టోర్ అవుతుంది. ఇది హార్డ్ వేర్ సెక్యూరిటీ మాడ్యుల్ (HSM) పేరుతో రూపొందించారు. ఈ కంపోనెంట్ ద్వారా హార్డ్ వేర్ లో స్టోర్ అయిన డేటాను స్టోర్ ఎన్ క్రిప్షన్ కీల ద్వారా భద్రపరుచుకోవచ్చు. ఈ డేటాను యాక్సస్ చేసుకోవాలంటే.. వాట్సాప్ యూజర్ encryption key ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. లేదంటే సెట్ చేసిన పర్సనల్ పాస్ వర్డ్ ద్వారా కూడా యాక్సస్ చేసుకోవచ్చు.
UN Cyber Attack : ఐక్యరాజ్య సమితిపై సైబర్ దాడి.. కీలక డేటా హ్యాక్.. ఎలా జరిగిందంటే?

ట్రెండింగ్ వార్తలు