WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మెసేజ్‌లను ఈజీగా ఎడిట్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

WhatsApp Web : వాట్సాప్ వెబ్ బీటా యూజర్లు ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు. ఈ ఫీచర్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. త్వరలో ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

WhatsApp Web : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడూ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. ప్రత్యేకించి వాట్సాప్ వెబ్ (Whatsapp Web) యూజర్ల కోసం ఎడిట్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్‌లో మెసేజ్‌లను పంపిన తర్వాత వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎడిట్ ఫీచర్ 2023 ప్రారంభంలో ప్రకటించింది. ఈ యాప్ బీటా వెర్షన్‌లో ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులో ఉంది.

వాట్సాప్‌ ట్రాక్ సైట్ బీటా టెస్టింగ్ (WABetaInfo) ప్రోగ్రామ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్లు ఇప్పుడు తమ మెసేజ్‌లను పంపిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ మెసేజ్ మెను ఆప్షన్ల నుంచి ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. చాట్‌లోని ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఉన్నంత వరకు ఎడిట్ మెసేజ్‌లను అప్‌డేట్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఈ ఫీచర్‌ని సపోర్ట్ చేయని పాత వెర్షన్‌ వాట్సాప్ యూజర్లందరికీ త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. మెసేజ్‌లను ఎడిట్ చేసిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు ఈ ఆప్షన్ ఎంచుకోగానే.. మెసేజ్ కొత్త విండోలో ఎడిట్ ఆప్షన్‌తో ప్రాంప్ట్ విండో కనిపిస్తుంది.

Read Also : WhatsApp Web Users : వాట్సాప్ వెబ్‌లో ఇన్ కమింగ్ కాల్ నోటిఫికేషన్లను ఇలా డిసేబుల్ చేయొచ్చు!

మీ వాట్సాప్ అకౌంట్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటే.. మీ చాట్‌లు, గ్రూపులలో మెసేజ్‌లను ఎడిట్ చేసేందుకు మీకు 15 నిమిషాల సమయం ఉంటుంది. వాట్సాప్ మెసేజ్‌లను అనేకసార్లు ఎడిట్ చేయడం సాధ్యమవుతుందని నివేదిక పేర్కొంది. వాట్సాప్ కాన్వరజేషన్ ప్రామాణికతను కొనసాగించవచ్చు. మెసేజ్‌లను ఎడిట్ చేసే లిమిట్ కూడా ఉంది. వాట్సాప్ యూజర్లు చాలా కాలం తర్వాత మెసేజ్ పూర్తిగా మార్చలేమని గమనించాలి. ఎందుకంటే ఈ ఫీచర్ టైపింగ్ లోపాలను సరిదిద్దడానికి మాత్రమే ఉపయోగించాల్సిన టూల్ అని నివేదిక తెలిపింది.

WhatsApp Web Users : releases edit messages feature for WhatsApp web users

వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేయాలంటే? :
* మీరు మెసేజ్ ఎడిట్ చేయాలనుకునే వాట్సాప్ చాట్ ఓపెన్ చేయండి.
* మీరు ఎడిట్ చేయాలనుకునే మెసేజ్ Tap చేసి పట్టుకోండి.
* Menu నుంచి ‘Edit’ ఆప్షన్ ఎంచుకోండి.
* మీకు కావలసిన మార్పులు చేసి, ‘Done’ బటన్‌ను నొక్కండి.
* చేసిన మార్పులు Save అవుతాయి. మెసేజ్ ఎడిట్ చేసినట్టుగా చాట్‌లో కనిపిస్తుంది.
* మెసేజ్‌లను పంపిన 15 నిమిషాలలోపు మాత్రమే ఎడిట్ చేయగలరు.
* అంతేకాదు.. మీరు మెసేజ్‌లను అనేకసార్లు ఎడిట్ చేసుకోవచ్చు.

వాట్సాప్ మెసేజ్ ఎడిట్ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ వెబ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ బీటా కూడా త్వరలో పొందే అవకాశం ఉంది. గూగుల ప్లే స్టోర్‌లో (Android 2.23.10.10) అప్‌డేట్ లేటెస్ట్ వాట్సాప్ బీటా ఫీచర్ అని సూచిస్తుంది. వాట్సాప్ కూడా ఆండ్రాయిడ్ యూజర్లకు iOS ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. (WABetaInfo) ఈ యాప్ త్వరలో కాల్స్ ట్యాబ్‌లో మిస్ కాల్‌ల పేర్లను రెడ్ కలర్‌లో చూపుతుందని నివేదించింది. దాంతో, వాట్సాప్ యూజర్లు ఎవరి నుంచి కాల్ మిస్ అయ్యారో గుర్తించవచ్చు. ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్‌లోనే ఉంది. ప్రస్తుతానికి బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Read Also : Airtel 5G Data Offer : ఎయిర్‌టెల్ 5G డేటా ఆఫర్.. నో డేటా లిమిట్.. అన్‌లిమిటెడ్ డేటా కోసం ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు