WhatsApp Web Users : వాట్సాప్ వెబ్‌లో ఇన్ కమింగ్ కాల్ నోటిఫికేషన్లను ఇలా డిసేబుల్ చేయొచ్చు!

WhatsApp Web Users : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ వాట్సాప్ (Whatsapp) తమ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం DND ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ వెబ్ యూజర్లు తమకు వచ్చే ఇన్ కమింగ్ ఫోన్ కాల్స్ నోటిఫికేషన్‌లను డిసేబుల్ చేయవచ్చు.

WhatsApp Web Users : వాట్సాప్ వెబ్‌లో ఇన్ కమింగ్ కాల్ నోటిఫికేషన్లను ఇలా డిసేబుల్ చేయొచ్చు!

WhatsApp web users can now disable incoming call notifications

WhatsApp Web Users : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ వాట్సాప్ (Whatsapp) తమ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం DND ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ వెబ్ యూజర్లు తమకు వచ్చే ఇన్ కమింగ్ ఫోన్ కాల్స్ నోటిఫికేషన్‌లను డిసేబుల్ చేయవచ్చు.

ఈ ఫీచర్ యాప్ వెబ్ వెర్షన్‌ ఇన్‌కమింగ్ వాట్సాప్ కాల్‌ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. WaBetaInfo నివేదించినట్లుగా Windows 2.2250.4.0 అప్‌డేట్ కోసం WhatsApp బీటాను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫీచర్ బీటా టెస్టర్‌లకు రిలీజ్ చేసింది.

ఒకవేళ మీకు తెలియకుంటే.. WaBetaInfo అనేది WhatsApp కొత్త, రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుందని నివేదిక పేర్కొంది. WhatsApp వెబ్ యూజర్లు వెబ్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా ఫీచర్‌ను ఆన్ చేయవచ్చు. మీరు ఈ ఫీచర్ కోసం టోగుల్‌ని చూసే నోటిఫికేషన్‌లపై Click చేయండి. మీరు వాట్సాప్ఇన్‌కమింగ్ WhatsApp కాల్స్ కోసం నోటిఫికేషన్‌లను డిసేబుల్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. తద్వారా వాట్సాప్ నోటిఫికేషన్‌లపై కంట్రోల్ కలిగి ఉంటారు.

WhatsApp web users can now disable incoming call notifications

WhatsApp web users can now disable incoming call notifications

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో పొరపాటున మెసేజ్ మరొకరికి పంపారా? ఈ కొత్త ఫీచర్ ద్వారా మెసేజ్ ఇలా బ్యాక్ వచ్చేస్తుంది!

WhatsApp యూజర్ల కోసం వాట్సాప్ (Undo) బటన్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ‘Delete For Everyone’కి బదులుగా ‘Delete For Me’ బటన్‌పై పొరపాటున నొక్కినప్పుడు దాన్ని UNDO చేసేందుకు ఈ ఫీచర్ యూజర్లను అనుమతిస్తుంది. ఈ నెల ప్రారంభంలో వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో అవతార్ (Avatar) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. గుర్తుతెలియని యూజర్ల కోసం అవతార్ అనేది డిజిటల్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఇందులో విభిన్నమైన హెయిర్ స్టైల్స్, ఫేషియల్ ఫీచర్‌లు, అవుట్‌ఫిట్‌ల బిలియన్ల ఎమోజీలతో అందుబాటులోకి వచ్చాయి.

WhatsApp మీ కేటగిరీ చేసిన అవతార్‌ను మీ ప్రొఫైల్ ఫొటోగా ఉపయోగించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు అనేక విభిన్నఎమోషన్లు, యాక్షన్లను ప్రతిబింబించే 36 సపోర్టెడ్ స్టిక్కర్‌లలో ఒకదాని నుంచి ఎంచుకోవచ్చు. వాట్సాప్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోవచ్చు. డిజిటల్ అవతార్‌లు మీ రియల్ ఫొటోను ఉపయోగించకుండా అవతార్ ఫొటోను సెట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

WhatsAppలో మీ అవతార్‌ను ఎలా క్రియేట్ చేయాలంటే? :

* WhatsApp ఓపెన్ చేసి Settings వెళ్లండి.
* మీరు Avatar అనే కొత్త ఆప్షన్ చూడవచ్చు.
* Create Your Avatarపై Tap చేయండి.
* మీ అవతార్‌ను క్రియేట్ చేసేందుకు ఇలా ఫాలో అవ్వండి.
* Done బటన్‌పై Tap చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Tricks & Tips : 2022లో ఉపయోగకరమైన 5 వాట్సాప్‌ టిప్స్ అండ్ ట్రిక్స్.. ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?