WhatsApp Tricks & Tips : 2022లో ఉపయోగకరమైన 5 వాట్సాప్‌ టిప్స్ అండ్ ట్రిక్స్.. ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?

WhatsApp Tricks & Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) భారత్‌లోని చాలా మంది యూజర్లకు అందుబాటులో ఉంది. వాట్సాప్ తమ యూజర్ల (Whatsapp Users) కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లో ప్రస్తుతం వేలకొద్దీ ఫీచర్‌లను కలిగి ఉంది.

WhatsApp Tricks & Tips : 2022లో ఉపయోగకరమైన 5 వాట్సాప్‌ టిప్స్ అండ్ ట్రిక్స్.. ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?

WhatsApp Tricks And Tips _ 5 useful WhatsApp tricks and tips you should know about in 2022

WhatsApp Tricks & Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) భారత్‌లోని చాలా మంది యూజర్లకు అందుబాటులో ఉంది. వాట్సాప్ తమ యూజర్ల (Whatsapp Users) కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లో ప్రస్తుతం వేలకొద్దీ ఫీచర్‌లను కలిగి ఉంది. వాట్సాప్ సెట్టింగ్‌ (Settings)లోకి వెళ్లాలి. థర్డ్-పార్టీ యాప్‌ ద్వారా కొన్ని ట్రిక్‌లు కూడా ఉన్నాయి. 2022లో ప్రవేశపెట్టిన 5 వాట్సాప్ ఉపయోగకరమైన టిప్స్ అండ్ ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

వాట్సాప్‌లో ఉపయోగకరమైన 5 టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవే :
* మీరు యాప్ ప్రైవసీ సెట్టింగ్‌లను నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. WhatsAppలో మీ ఆన్‌లైన్ Status హైడ్ చేయవచ్చు. వాట్సాప్‌లో Settings > Privacy > Last Seen And online ఆన్‌లైన్‌కి వెళ్లండి. ఇప్పుడు ‘Nobody’పై Tap చేయండి. ఆపై Same As Last Seen’ Tap చేయండి. కానీ, మీరు Settings ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేస్తే మీరు కూడా ఇతర యూజర్ల ఆన్‌లైన్ స్టేటస్ చూడలేరు. ఈ ఫీచర్ ప్రాథమికంగా గురించి ఎవరికీ తెలియకుండా ఆన్‌లైన్‌లో ఉండేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.

* వాట్సాప్‌లో అనుకోకుండా డిలీట్ చేసిన మెసేజ్‌లను Undo చేసే సామర్థ్యాన్ని ఇప్పుడే అందుబాటులోకి తెచ్చింది. మీరు పొరపాటున మెసేజ్‌ని డిలీట్ చేస్తే.. Undo బటన్‌ను ఉంచడం ద్వారా రివర్స్ చేసేందుకు 5 సెకన్ల విండోను అందిస్తుంది. మీరు ‘Delete Message For Me’పై Tap చేస్తే మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తుంది. అందులో ‘Delete for Me’ లేదా ‘Delete for Everyone’ అని ఏదైనా ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల అందుబాటులో ఉంది.

WhatsApp Tricks And Tips _ 5 useful WhatsApp tricks and tips you should know about in 2022

WhatsApp Tricks And Tips _ 5 useful WhatsApp tricks and tips you

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో పొరపాటున మెసేజ్ మరొకరికి పంపారా? ఈ కొత్త ఫీచర్ ద్వారా మెసేజ్ ఇలా బ్యాక్ వచ్చేస్తుంది!

* మీరు హాఫ్-రికార్డ్ చేసిన మెసేజ్ కోల్పోకుండా ఇన్‌స్టంట్, సుదీర్ఘ వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేయవచ్చు. మీరు మైక్ ఐకాన్‌ (Mike Icon)పై లాంగ్ ప్రెస్ చేస్తూ Tap చేస్తే చాలు. ఈ ఫోన్‌లో రైట్ కార్నర్ కిందిభాగంలో ఉన్న ప్రతి చాట్‌లో కనిపిస్తుంది. మైక్ ఐకాన్ ఎక్కువసేపు Tap చేసి లాక్ ఐకాన్‌పైకి చేయండి.

వాట్సాప్ మీ వాయిస్ మెసేజ్ రికార్డ్ చేయవచ్చు. మీరు రెడ్ కలర్ మైక్ ఐకాన్ ఉపయోగించి పాజ్ చేయవచ్చు. మీరు కొంత సమయం పాటు రికార్డింగ్ నుంచి నిష్క్రమించవలసి వస్తే.. మీ రికార్డింగ్ డిలీట్ కాదు. మీరు తర్వాత Chatకు తిరిగి రావచ్చు. మీరు మీ మెసేజ్ రికార్డ్ చేయడం కొనసాగించవచ్చు.

* Cube ACR అనే థర్డ్-పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా యూజర్లు WhatsApp కాల్‌లను రికార్డ్ చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌ (Google Play Store)లో అందుబాటులో ఉంది. మీరు ఇన్‌స్టాల్ చేసి.. మీ అన్ని కాల్‌లను రికార్డ్ చేసేందుకు అనేక అనుమతులను పొందాల్సి ఉంటుంది. మీరు మీ అన్ని కాల్ రికార్డింగ్‌లను ఒకే యాప్‌లో పొందవచ్చు.

* తొలగించిన వాట్సాప్ మెసేజ్‌లను రికవర్ చేసే లేదా చదవాలనుకునే యూజర్లు ప్లే స్టోర్ (Play Store) ద్వారా ‘Get Deleted Messages’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా పొందవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మీరు యాప్‌కి డివైజ్ Permission ఇవ్వాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మీరు ఈ యాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవగలరు. ఈ యాప్ మీ ఫోన్‌లో రన్ చేసేందుకు మీ అనుమతి అవసరమని గుర్తుంచుకోండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ చాట్‌ని ఓపెన్ చేసి ఆ మెసేజ్ డిలీట్ చేస్తే.. మీరు డిలీట్ చేసిన మెసేజ్ చదవలేరు. వాట్సాప్ చాట్ ఓపెన్ అయితే (మెసేజ్ డిలీట్ సమయంలో) మాత్రమే డిలీట్ మెసేజ్ యాప్ పనిచేస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp DND Feature : వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం కొత్త DND ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందో తెలుసా?