WhatsApp New Feature : వాట్సాప్‌లో పొరపాటున మెసేజ్ మరొకరికి పంపారా? ఈ కొత్త ఫీచర్ ద్వారా మెసేజ్ ఇలా బ్యాక్ వచ్చేస్తుంది!

WhatsApp New Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఎవరికైనా పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే అది తిరిగి పొందవచ్చు. సాధారణంగా వాట్సాప్‌ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది.

WhatsApp New Feature : వాట్సాప్‌లో పొరపాటున మెసేజ్ మరొకరికి పంపారా? ఈ కొత్త ఫీచర్ ద్వారా మెసేజ్ ఇలా బ్యాక్ వచ్చేస్తుంది!

WhatsApp New Feature _ Sent message to wrong person_ New WhatsApp feature will save from the embarrassment

WhatsApp New Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఎవరికైనా పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే అది తిరిగి పొందవచ్చు. సాధారణంగా వాట్సాప్‌ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది. ఇప్పటికే చాలా వాట్సాప్ ఫీచర్లు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. అందులో డిలీట్ ఫర్ ఎవరీవన్ (Delete For Everyone), డిలీట్ ఫర్ మి (Delete For Me) అనే రెండు ఫీచర్లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

అయితే, వాట్సాప్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. మెసేజ్‌లను ఎడిట్ చేయడం నుంచి వ్యూ వన్స్ మీడియా, స్క్రీన్‌షాట్ బ్లాక్ చేయడం వంటి అనేక ఫీచర్లను మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరుస్తూనే ఉంటోంది. వాట్సాప్ కొత్త అప్‌డేట్లతో పాటు కేవలం మరిన్ని ఆహ్లాదకరమైన ఫీచర్‌లను అందించడానికి మాత్రమే కాకుండా యూజర్ల ప్రైవసీకి మరిన్ని లేయర్‌లను యాడ్ చేస్తోంది.

వాట్సాప్ ఇప్పటికే ‘డిలీట్ ఫర్ ఎవర్రీవన్’ ఆప్షన్‌కు బదులుగా ‘డిలీట్ ఫర్ మి’ ఆప్షన్‌ను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది. ఇప్పుడు కూడా వాట్సాప్ మరో కొత్త రెస్క్యూ ఫీచర్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్ ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘Accidental Delete’ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది.

WhatsApp Feature _ Sent message to wrong person_ New WhatsApp feature will save from the embarrassment

WhatsApp New Feature _ Sent message to wrong person_ New WhatsApp feature will save from the embarrassment

Read Also : WhatsApp for iPhone Users : 2023లో ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మల్టీ టాస్క్ ఎంతో ఈజీ..!

యూజర్లు ప్రతి ఒక్కరి కోసం మీడియాను డిలీట్ చేయాలని కోరుకునే ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు సాయపడుతుంది. కానీ, ‘Delete For Me’ ఆప్షన్‌ను Tap చేయండి.వాట్సాప్ వినియోగదారు WhatsApp మెసేజ్ డిలీట్ చేసిన ప్రతిసారీ, Undo చేసేందుకు డిలీట్ చేసిన సమయం నుంచి ఐదు సెకన్ల విండోను పొందవచ్చు. ఇంతకీ ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం..

Undo delete for me message :

* పర్సనల్ లేదా గ్రూపు చాట్‌లో మెసేజ్ పంపండి.
* ఇప్పుడు మీరు డిలీట్ చేసిన మెసేజ్ Tap చేసి పట్టుకోండి.
* delete for everyone కోసం Deleteపై Tap చేయండి.
* మీరు ‘delete for me’ పై Tap చేస్తే.. Undo బటన్ ప్రాంప్ట్ అవుతుంది.
* మీరు డిలీట్ చేసేందుకు undo బటన్‌పై Tap చేయండి.
* మీరు ఇప్పుడే Delete Message వెంటనే మళ్లీ కనిపిస్తుంది.

ముఖ్యంగా, కొత్త ‘Accidental Delete’ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS యూజర్ల అందరికి అందుబాటులో ఉంది. మీరు ఫీచర్‌ని ఉపయోగించలేకపోతే.. Google Play స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీ WhatsApp యాప్‌ను Update చేయండి.
ఇంతలో, Meta WhatsAppలో కొత్త రాబోయే మెరుగైన కాలింగ్ ఫీచర్లను కూడా ప్రకటించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp New Scam : వాట్సాప్‌లో కొత్త సైబర్ స్కామ్.. ఏకంగా రూ. 57 కోట్లు కోల్పోయిన యూజర్లు.. ఇలా చేస్తే.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండొచ్చు!