WhatsApp for iPhone Users : 2023లో ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మల్టీ టాస్క్ ఎంతో ఈజీ..!

WhatsApp for iPhone Users : 2023లో ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మల్టీ టాస్క్ ఎంతో ఈజీ..!

WhatsApp is bringing Picture-in-Picture feature for iPhone users in 2023, currently in beta

WhatsApp for iPhone Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు గుడ్‌న్యూస్.. అతి త్వరలో ప్రత్యేకించి ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఫీచర్ ఒకటి రాబోతోంది. ఇప్పటికే వాట్సాప్‌లో గ్రూప్ చాట్‌లు, కాలింగ్ ఎక్స్‌పీరియన్స్, యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరచడమే లక్ష్యంగా (WhatsApp New Features ) ఈ ఏడాదిలో అనేక కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. లేటెస్టుగా వాట్సాప్ ఇప్పుడు iPhone వినియోగదారుల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్‌ (Picture-in-Picture feature)ను లాంచ్ చేయడాన్ని ధృవీకరించింది. వాట్సాప్ 2023లో iOSలో పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ రాబోతోందని వెల్లడించింది.

ఐఫోన్ iOSలోని పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. బీటాకు మెంబర్‌షిప్ పొందిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. స్టేబుల్ ఫీచర్ రిలీజ్ అయ్యేందుకు కొంత సమయం పడుతుందని అంటున్నారు. వాట్సాప్  iOS యూజర్ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ ఎప్పుడు లాంచ్ చేసేది మాత్రం వెల్లడించలేదు. రాబోయే 2 నుంచి 3 నెలల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని భావించవచ్చు. మొదట బీటాలో టెస్టింగ్ చేసే అవకాశం ఉంది. ఐఫోన్ యూజర్లందరికి స్టేబుల్ అప్‌డేట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Read Also :  WhatsApp Search Groups : వాట్సాప్ చాట్ లిస్టులో ఇకపై గ్రూపులను ఈజీగా సెర్చ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

వాట్సాప్‌లో PiP మోడ్ ఎప్పుడంటే? :
వాట్సాప్‌లో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడల్ iOSకి అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ యూజర్లు సులభంగా మల్టీటాస్క్ చేయవచ్చు. మీరు స్నేహితుడితో చాట్ చేయొచ్చు.. లేదంటే వీడియో కాల్‌లో మాట్లాడుతూనే.. అదే సమయంలో ఫోన్ డిస్‌ప్లేలో ఒక కార్నర్‌లో చిన్న స్క్రీన్‌పై వీడియోను చూడవచ్చు. ఇప్పుడు బీటా టెస్టింగ్, 2023లో లాంచ్ కాబోతోంది. మీరు ఫోన్ కాల్‌లో ఉన్నప్పుడు సులభంగా మల్టీ టాస్క్ చేయవచ్చు.

WhatsApp for iPhone Users : WhatsApp is bringing Picture-in-Picture feature for iPhone users in 2023

WhatsApp for iPhone Users : WhatsApp is bringing Picture-in-Picture feature for iPhone users in 2023

2023లో వాట్సాప్ మొత్తం కాలింగ్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపర్చేందుకు మల్టీ ఫీచర్లను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి 32 మంది వీడియో కాలింగ్ సపోర్ట్  (Video Calling Support) కూడా అందిస్తుంది. జూమ్ (zoom), స్కైప్ (Skpe), ఇతరులతో సహా ఇతర వీడియో కాలింగ్ ప్లాట్‌ఫారమ్‌లను స్వీకరించవచ్చు. వాట్సాప్ వీడియో కాల్ సమయంలో మెసేజ్ చేయడమే కాదు.. గ్రూపు కాల్‌లో పాల్గొనేవారిని మ్యూట్ చేసేందుకు ఆప్షన్ యాడ్ చేయనుంది.

మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం వ్యూ వన్స్ టెక్స్ట్‌ (View Once Text)తో సహా మల్టీ ఫీచర్లను టెస్టింగ్ చేస్తోంది. వ్యూ వన్స్ మీడియా (View Once Media) ఫీచర్ మాదిరిగానే పని చేస్తుంది. వాట్సాప్ యూజర్లు తమ ఫొటో వ్యూయర్‌ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫొటో కనిపించకుండా పోతుంది. అలాగే, వీడియోని పంపేందుకు ప్లాట్‌ఫారమ్ యూజర్లకు అనుమతిస్తుంది.

మీడియా వ్యూయర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ చాట్‌లో ఫొటో కనిపించదు. ఆ తర్వాత మళ్లీ ఆ ఫొటోను చూడలేరు. వాట్సాప్‌లో వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా ఫొటోలు లేదా గ్యాలరీలో ఎప్పటికీ ఫొటోలు, వీడియోలను సేవ్ చేయలేరని గమనించాలి. అలాగే, వాట్సాప్ మీడియా ఫైళ్లను మరెవరికీ ఫార్వార్డ్ చేయలేరు. కానీ, మీడియా స్క్రీన్‌షాట్‌లను మాత్రం తీసుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Live Location on WhatsApp : మీ వాట్సాప్‌లో ‘లైవ్ లొకేషన్’ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!