Live Location on WhatsApp : మీ వాట్సాప్‌లో ‘లైవ్ లొకేషన్’ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Live Location on WhatsApp : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. ఇతర ఫీచర్‌లతో పాటు, సోషల్ మెసేజింగ్ యాప్ లైవ్ లొకేషన్‌ (Live Location)ను అందిస్తుంది.

Live Location on WhatsApp : మీ వాట్సాప్‌లో ‘లైవ్ లొకేషన్’ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

How to use live location on WhatsApp _ A step-by-step guide

Updated On : December 13, 2022 / 8:38 PM IST

Live Location on WhatsApp : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. ఇతర ఫీచర్‌లతో పాటు, సోషల్ మెసేజింగ్ యాప్ లైవ్ లొకేషన్‌ (Live Location)ను అందిస్తుంది. వాట్సాప్ యూజర్లు తమ రియల్ టైమ్ లొకేషన్ నిర్దిష్ట సమయం వరకు ఇతర యూజర్లకు షేర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ లైవ్ లొకేషన్ ఫీచర్ (Live Location Feature) తమ లైవ్ లొకేషన్‌ను ఎంతసేపు షేర్ చేయాలో కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది.

మీరు ఎప్పుడైనా ఇతర కాంటాక్ట్‌లతో లైవ్ లొకేషన్ షేర్ చేయడాన్ని నిలిపివేయవచ్చు. WhatsApp మెసేజ్‌ల మాదిరిగానే.. లైవ్ లొకేషన్ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసినట్టు కంపెనీ తెలిపింది. మీరు షేర్ చేసిన యూజర్లు తప్ప మీ లైవ్ లొకేషన్‌ను ఎవరూ చూడలేరు. WhatsAppలో మీ లొకేషన్‌ను షేర్ చేసే ముందు, మీరు మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లలో WhatsApp కోసం లొకేషన్ తప్పనిసరిగా Allow చేయాలనే విషయాన్ని గుర్తించుకోవాలి.

* మీ ఫోన్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లండి.
* ఇక్కడ, Apps & Notifications నావిగేట్ చేయండి.
* Advanced ఆప్షన్‌కు వెళ్లి, ఆపై App permissions వెళ్లండి.
* ఇప్పుడు, Locationపై ట్యాప్ చేసి, WhatsAppని ON చేయండి.
* WhatsAppలో మీ లైవ్ లొకేషన్‌ను ఇతరులతో ఇలా షేర్ చేయవచ్చు.
* మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* మీరు లైవ్ లొకేషన్‌ని షేర్ చేయాలనుకునే individual లేదా (Group Chat)కి వెళ్లండి
* చాట్ విండోస్‌లో, Attach> Location > Share live locationపై Tap చేయండి.
* మీరు మీ లైవ్ లొకేషన్ షేర్ చేయాలనుకునే సమయాన్ని ఎంచుకోవచ్చు.
* ఎంచుకున్న సమయం తర్వాత మీ లైవ్ లొకేషన్ షేర్ చేయడం కుదరదు.
* మీరు కోరుకుంటే, మీ లొకేషన్ షేర్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా కామెంట్ కూడా యాడ్ చేయవచ్చు.
*ఇప్పుడు, Sendపై Tap చేయండి.

How to use live location on WhatsApp _ A step-by-step guide

How to use live location on WhatsApp _ A step-by-step guide

Read Also : WhatsApp Search Groups : వాట్సాప్ చాట్ లిస్టులో ఇకపై గ్రూపులను ఈజీగా సెర్చ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsAppలో మీ లైవ్ లొకేషన్‌ను షేర్ చేయకుండా ఎలా ఆపాలో తెలుసా?

వ్యక్తిగత చాట్‌ల కోసం :
* వాట్సాప్‌కి వెళ్లి individual లేదా Group chatని ఓపెన్ చేయండి.
* ఇక్కడ, స్టాప్ షేరింగ్‌ (Stop Sharing)పై Tap చేయండి.
* ఆపై STOPపై Tap చేయండి.

గ్రూప్ చాట్‌ల కోసం:
* వాట్సాప్ ఓపెన్ చేసి Group Chatకి వెళ్లండి
* More options > Settings > Privacy > Live locationపై నొక్కండి.
* ఆ తర్వాత, STOP SHARINGపై నొక్కి ఆపై STOPపై నొక్కండి.

Note : వాట్సాప్ యూజర్లు మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా ఎప్పుడైనా WhatsApp కోసం లొకేషన్ అనుమతులను నిలిపివేయవచ్చునని గుర్తుంచుకోండి. ఇక్కడ, Apps & notifications > Advanced > App permissions > Location > turn off WhatsApp. మీరు ఇప్పుడు disabled location permission నిలిపివేశారని నిర్ధారించుకోండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. మీరు పంపిన మెసేజ్‌‌లను ఒకసారి మాత్రమే చూడొచ్చు..!