Whatsapp : వాట్సాప్ గ్రూపు కాల్‌లో హోస్టు.. ఎవరినైనా మ్యూట్ చేయొచ్చు..!

Whatsapp : వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్ కొత్త అప్‌డేట్ అందుకుంది. గ్రూప్ కాల్ హోస్ట్ ఇకపై ఎవరైనా మ్యూట్ చేయవచ్చు.

Whatsapp : వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్ కొత్త అప్‌డేట్ అందుకుంది. గ్రూప్ కాల్ హోస్ట్ ఇకపై ఎవరైనా మ్యూట్ చేయవచ్చు. వాట్సాప్ పార్టిసిపెంట్స్ లిమిట్ పెంచినప్పటికీ, కొన్ని కీలకమైన ఫీచర్‌లు అందుబాటులో లేవు. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్ మరింత ఉపయోగకరంగా మారనుంది. @WhatsAppలో గ్రూప్ కాల్స్‌లో కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

గ్రూపు కాల్‌లో ఏ యూజర్లు అయినా మ్యూట్ చేయవచ్చు. గ్రూపు కాల్ కొనసాగుతున్న సమయంలో వారి మైక్ మ్యూట్ చేయకపోతే.. హోస్టు వారి మైక్ మ్యూట్ చేయవచ్చు. గ్రూపు కాల్‌లో ఎక్కువ మంది యూజర్లు చేరినప్పుడు మరింత సులభంగా చూడగలరు. గ్రూప్ కాల్ సమయంలో మ్యూట్ చేసే అవకాశంతో పాటు ఎక్కువ మంది యూజర్లు చేరినప్పుడు వాట్సాప్ గ్రూప్ కాల్ హోస్ట్‌కు తెలియజేస్తుంది.

ఏప్రిల్ 2022లో గ్రూప్ కాల్‌కు గరిష్టంగా 32 మంది సభ్యులను యాడ్ చేసే అవకాశాన్ని WhatsApp అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ గతంలో ఒకేసారి 8 మంది పార్టిసిపెంట్‌లను మాత్రమే గ్రూప్ వీడియో కాల్‌లో చేరడానికి అనుమతించింది. మీరు గ్రూప్ వాయిస్ కాల్‌ని అనుమతించగానే.. ఇన్‌కమింగ్ WhatsApp గ్రూప్ వాయిస్ కాల్ స్క్రీన్ ప్రస్తుతం కాల్‌లో ఉన్న పార్టిసిపెంట్‌ల లిస్టును చూపిస్తుంది.

Whatsapp Will Now Let Group Call Host Mute Noisy People

అందులో ఫస్ట్ కాంటాక్ట్ మిమ్మల్ని పార్టిసిపెంట్‌గా చూపిస్తుంది. గ్రూప్ వాయిస్ కాల్ హిస్టరీ CALLS ట్యాబ్‌లో కనిపిస్తుంది. మీరు కాల్ సమయంలో యూజర్ల కాల్ హిస్టరీని చెక్ చేయవచ్చు. మిస్డ్ కాల్‌లు ఇంకా కొనసాగుతున్నట్లయితే మీరు మధ్యలో కాల్ లో కనెక్ట్ కావొచ్చు వాట్సాప్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఈ కొత్త ఫీచర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వాట్సాప్ వెల్లడించలేదు.

మీరు వాట్సాప్‌లో గ్రూప్ కాల్ చేయడం ఎలాగంటే? :

* మీరు వాయిస్ కాల్ చేసే గ్రూప్ చాట్‌ని ఓపెన్ చేయండి.
* మీ గ్రూప్‌లో 32 మంది కంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్‌లు ఉంటే.. మీరు గ్రూప్ కాల్ ఆప్షన్‌ను Tap చేయవచ్చు
* 33 కంటే ఎక్కువ మంది పాల్గొనేవారు ఉంటే, మీరు వాయిస్ కాల్‌లో Tap చేయడం లేదా మీ నిర్ణయాన్ని నిర్ధారించుకోవచ్చు. * సమాధానం ఇచ్చే మొదటి ఏడుగురు వ్యక్తులు కాల్‌లో మీరు చేరవచ్చు.. గ్రూప్ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొనగలరు.
* మీరు కాల్‌కు యాడ్ కాంటాక్టులను కూడా చేరవచ్చు. ఆపై వాయిస్ కాల్‌ని Tap చేయండి.

Read Also : WhatsApp New Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. ఇక ఆండ్రాయిడ్ టు ఐఫోన్ చాట్ ట్రాన్స్‌ఫర్ ఈజీ..!

ట్రెండింగ్ వార్తలు