WhatsApp International Payments : వాట్సాప్ భారతీయ యూజర్ల కోసం అంతర్జాతీయ పేమెంట్లు.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp International Payments : రాబోయే కొత్త ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఫీచర్‌ ఉపయోగించి భారతీయ బ్యాంక్ అకౌంటుదారులు విదేశాలకు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

WhatsApp International Payments : ప్రముఖ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ గతంలో అనేక ఫీచర్లను ఆవిష్కరించింది. ఇటీవలి నివేదికల ప్రకారం.. వాట్సాప్ ఇప్పుడు భారతీయ యూజర్ల కోసం అంతర్జాతీయ లావాదేవీలను సులభతరం చేయనుంది. టిప్‌స్టర్ ప్రకారం.. వాట్సాప్ భారతీయ యూజర్లను తమ యాప్ ద్వారా అంతర్జాతీయ పేమెంట్లను చేసేందుకు కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.

ఇప్పటికే యాప్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సాయంతో ఇంటర్నేషనల్ పేమెంట్లు చేసేందుకు వీలుంది. రాబోయే కొత్త ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఫీచర్‌ ఉపయోగించి భారతీయ బ్యాంక్ అకౌంటుదారులు విదేశాలకు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అయితే, బ్యాంకులు అంతర్జాతీయ యూపీఐ సేవలను ప్రారంభించిన దేశాలు మాత్రమే ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోగలవు.

Read Also : WhatsApp AI Image Editor : వాట్సాప్‌లో ఏఐ ఇమేజ్ ఎడిటర్ వచ్చేస్తోంది.. మీ ఫొటోల బ్యాక్‌గ్రౌండ్ ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు!

లావాదేవీల పరిమితి గరిష్టంగా 3 నెలల వ్యవధి :
వినియోగదారులు అంతర్జాతీయ చెల్లింపుల ఫీచర్‌ను మాన్యువల్‌గా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. యూజర్లు ఈ కొత్త ఫీచర్‌ను యాక్టివ్‌గా ఎంతసమయం యాక్టివ్‌గా ఉండాలో కూడా టైమ్ సెట్ చేసుకోవచ్చు. గూగుల్ పే ద్వారా చేసే పేమెంట్లకు ఏడు రోజుల లావాదేవీ పరిమితి ఉండగా.. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ద్వారా గరిష్టంగా మూడు నెలల వ్యవధిని అందించవచ్చని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా, గూగుల్ పే, ఫోన్ పే వంటి భారత్‌లోని ఇతర ప్రముఖ యూపీఐ ప్లేయర్‌లు ఇప్పటికే ఇలాంటి సర్వీసులను అందిస్తున్నాయి. ఈ ఫీచర్ అధికారికంగా వాట్సాప్ లేదా ఇతర బీటా టెస్టర్ల ద్వారా ధృవీకరించలేదు.

యూజర్ల కోసం మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు :
వాట్సాప్ మరిన్ని ఫీచర్లను రిలీజ్ చేయనుంది. అందులో స్టేటస్ అప్‌డేట్ ఇంటర్‌ఫేస్ కోసం కొన్ని ప్రధాన డిజైన్ మార్పులను ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల నివేదించింది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ త్వరలో యూజర్లు తమ స్టేటస్‌గా షేర్ చేయాలనుకునే కంటెంట్ టైప్ మధ్య సులభంగా మారవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

నివేదిక ప్రకారం.. ఇప్పుడు గూగుల్ పే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ 2.24.7.16 అప్‌డేట్ లేటెస్ట్.. వాట్సాప్ బీటాలో మాదిరిగా స్టేటస్ స్టేటస్ అప్‌డేట్స్ అందించే కొత్త టూల్స్ కోసం అన్వేషిస్తోంది. స్టేటస్ అప్‌డేట్‌ల కోసం వాట్సాప్ లేటెస్ట్ ఇంటర్‌ఫేస్ అప్‌డేట్ చేస్తోంది.

పోర్టల్ స్క్రీన్ షాట్ ప్రకారం.. వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌ కోసం కొత్త కంపోజర్‌ను రూపొందిస్తోంది. షేరింగ్ కోసం వివిధ మీడియా ఫార్మాట్‌ల మధ్య మారడానికి యూజర్లను అనుమతిస్తుంది. స్టేటస్ అప్‌డేట్ స్క్రీన్ దిగువన, యూజర్లు టెక్స్ట్, వీడియోలు లేదా ఫొటోలను షేర్ చేయడానికి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇక్కడి నుంచే వినియోగదారులు తాము షేర్ చేయాలనుకునే మీడియా టైప్ సులభంగా ఎంచుకోవచ్చు.

Read Also : Aadhaar Update Deadline : గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఈ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు