WhatsApp : వాట్సాప్‌‌ గ్రూపులో ఇకపై సైలెంటుగా ఎగ్జిట్ కావొచ్చు.. వారికి మాత్రమే తెలుస్తుంది..!

WhatsApp New Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. సాధారణంగా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ పోతుంటారు.

WhatsApp New Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. సాధారణంగా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ పోతుంటారు. కొన్నిసార్లు గ్రూపులో సభ్యుల కారణంగా అందులో నుంచి ఎగ్జిట్ అవుతుంటారు. అయితే ఇలా ఎగ్జిట్ అయిన ప్రతి గ్రూపులో ఒక మెసేజ్ కనిపిస్తుంది. మీరు గ్రూపులో నుంచి ఎగ్జిట్ అయినట్టు అందులోని సభ్యులందరికి తెలిసిపోతుంది. కానీ, రాబోయే ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు గ్రూపుల్లో నుంచి ఎగ్జిట్ అయిన విషయం మీకు, మీ గ్రూపు అడ్మిన్‌కు మాత్రమే తెలిసే వీలుంది. మీరు గ్రూపులో నుంచి సైలెంటుగా ఎగ్జిట్ అయిపోవచ్చు. అది మీకు, మీ గ్రూపు హోస్టుకు మాత్రమే తెలుస్తుంది. మీరు ఎప్పుడూ గ్రూపులో నుంచి ఎగ్జిట్ అయ్యారో కూడా సభ్యులకు తెలియదు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో నుంచి ఎగ్జిట్ కాగానే.. మీకు exit అయినట్టుగా ఒక మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది. అది గ్రూపులోని అందరి సభ్యులకు కనిపిస్తుంది. తద్వారా మీరు గ్రూపులో నుంచి ఎగ్జిట్ అయ్యారనే విషయం అందరికి తెలిసిపోతుంది.

Whatsapp Will Soon Let You Exit Pesky Family Groups Without Letting Members Know

ఇప్పుడు రాబోయే కొత్త ఫీచర్ ద్వారా మీరు గ్రూపులో నుంచి ఎగ్జిట్ అయిన విషయం తెలియదు. ఎగ్జిట్ మెసేజ్ చాట్ బాక్సులో డిస్‌ప్లే కాదు. చాలామంది వాట్సాప్ యూజర్లు అనేక గ్రూపుల్లో జాయిన్ అవుతుంటారు. కొన్నిరోజులకు ఆ వాట్సాప్ గ్రూపులో మీకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే అందులో నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇక్కడ మీ ఎగ్జిట్ మెసేజ్ వాట్సాప్ చాట్ బాక్సులో కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఎగ్జిట్ అయినా సభ్యులు ఎవరికి కనిపించదు. అయితే మీరు గ్రూపు అడ్మిన్ కు మాత్రం తెలుస్తుందని గుర్తించుకోండి. మెసేజింగ్ యాప్‌కు సంబంధించిన ట్రాకింగ్ చేసే Wabetainfo నివేదిక తెలిపింది. ఫీచర్స్ ట్రాకర్ ప్రకారం.. వాట్సాప్ చాట్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశాన్ని అందిస్తుంది.

వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. గ్రూపులో నుంచి ఎవరు ఎలా ఎగ్జిట్ అయ్యారు అనేది చూడటం ఇప్పటికీ సాధ్యమేనని Wabetainfo బ్లాగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆ కొత్త ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందని Wabetainfo నివేదించింది. ఇంకా బీటా టెస్టర్‌లకు అందుబాటులో రాలేదు. ఎంపిక చేసిన కాంటాక్ట్‌ల నుంచి చివరిగా చూసిన, ప్రొఫైల్ ఫొటో స్టేటస్ అప్ డేట్స్ హైడ్ చేసే ఫీచర్లను వాట్సాప్ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్‌లో మీ ప్రైవసీని మరింత పెంచడానికి మీ ప్రైవసీ కంట్రోల్ సెట్టింగ్‌లకు కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొస్తాం. మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి మీ ప్రొఫైల్ ఫొటో గురించి చివరిగా చూసిన స్టేటస్ ఎవరు చూడగలరో ఎంచుకోవచ్చు.

Read Also : WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఆ కాంటాక్టులకు మీ ప్రొఫైల్ హైడ్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు