WhatsApp Feature
WhatsApp Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకు పైగా యూజర్లతో వాట్సాప్ సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడూ రిలీజ్ చేస్తూనే ఉంది. ఈసారి, ఇంటర్నెట్ డేటా వినియోగంపై కంట్రోల్ అందించే అద్భుతమైన ఫీచర్ల రిలీజ్ చేయనుంది.
ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. అతి త్వరలో యూజర్లందరికి అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ ఫీచర్ స్పెషాలిటీ ఏంటంటే.. హై డేటా వినియోగంతో విసిగిపోయిన వారికి ఇది గేమ్-ఛేంజర్ ఫీచర్ అని చెప్పవచ్చు. మీ మీడియా ఫైల్స్ ఆటో డౌన్‌లోడ్‌కు సంబంధించి ఇక ఫుల్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది. దాంతో మీ డేటాతో పాటు ఫోన్ స్టోరేజీని కూడా సేవ్ చేయొచ్చు.
ఆటో డౌన్‌లోడ్ కంట్రోల్ ఫీచర్ ఇదే :
ప్రస్తుతం వాట్సాప్ ఫొటోలు, వీడియోలతో నిండిపోతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ఆఫీసు, స్కూల్ గ్రూపుల వరకు మీడియా ఫైల్స్ ప్రతిరోజూ డివైజ్ స్టోరేజీతో నిండిపోతుంటాయి. కానీ ఆటో-డౌన్‌లోడ్ ఆన్ చేయడం వల్ల ఈ మీడియా ఫైల్స్ సైజు లేదా క్వాలిటీతో సంబంధం లేకుండా భారీ డేటాను వినియోగిస్తాయి.
ఇప్పుడు, వాట్సాప్ ఫొటోలు, వీడియోలు ఆటోమాటిక్‌గా డౌన్‌లోడ్ ద్వారా క్వాలిటీని కంట్రోల్ చేయొచ్చు. వాట్సాప్ తమ యూజర్ల కోసం అనుమతించే కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఇప్పుడు ప్రతి మీడియా ఫైల్స్‌ను హై రిజల్యూషన్‌లో డౌన్‌లోడ్ చేయడాన్ని నివారించవచ్చు. మీ డేటాతో పాటు స్టోరేజీ ఆప్షన్ రెండింటినీ సేవ్ చేయవచ్చు.
కొత్త ఫీచర్ బెనిఫిట్స్ :
ఈ కొత్త ఫీచర్‌ను మొదట వాట్సాప్ ట్రాకర్ (WABetaInfo) గుర్తించింది. నివేదిక ప్రకారం.. కొత్త యాక్టివిటీ వాట్సాప్ బీటా వెర్షన్ 2.25.12.24లో కనిపించింది. ఎవరైనా మీకు హై క్వాలిటీ ఫొటో లేదా వీడియోను పంపితే వాట్సాప్ ఆటోమాటిక్‌గా కంప్రెస్డ్ (స్టాండర్డ్) వెర్షన్‌ను క్రియేట్ చేస్తుంది.
మీ ఆటో-డౌన్‌లోడ్ సెట్టింగ్స్ స్టాండర్డ్ వెర్షన్‌ను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేయడం ద్వారా పంపినవారు ఫైల్‌ను హై క్వాలిటీతో షేర్ చేసినప్పటికీ మీకు అవసరమైన క్వాలిటీలో మాత్రమే డౌన్‌లోడ్ అవుతుంది.
డేటా, స్టోరేజీ సేవ్ చేయొచ్చు :
ప్రస్తుతం, వాట్సాప్ ఆటో-డౌన్‌లోడ్ సెట్టింగ్ ఫైల్స్ పంపిన క్వాలిటీలోనే డౌన్‌లోడ్ చేస్తుంది. ఫలితంగా మొబైల్ డేటా అనవసరంగా అయిపోతుంది. రాబోయే కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు అవసరమైన డౌన్‌లోడ్ క్వాలిటీని స్టాండర్డ్ లేదా హై అనే ఆప్షన్లను ముందే ఎంచుకునే ఎంచుకోవచ్చు.
Read Also : Amazon Sale : ట్రిపుల్ కెమెరా ఫోన్ కావాలా? మోటో ఎడ్జ్ 50ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇంకా ధర తగ్గాలంటే..!
ఈ ఫీచర్ ముఖ్యంగా గ్రూప్ చాట్‌లలో ఉపయోగకరంగా ఉంటుంది. వినియోగదారులు అనవసరమైన ఫొటోలు, వీడియోలను ఆటో డౌన్‌లోడ్ కాకుండా ఆపొచ్చు. లో క్వాలిటీ వెర్షన్‌లకు డౌన్‌లోడ్ లిమిట్ పెట్టొచ్చు. తద్వారా, వినియోగదారులు డేటా వాడకం తగ్గుతుంది. స్టోరేజీ కూడా త్వరగా ఫుల్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు.